Megastar-Godfather: చిరు సినిమాలో రమ్య.. బ్యూటిఫుల్ జోడీ రిపీట్ కానుందా.. కానీ..
Megastar-Godfather: రీమేక్ సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన చిరంజీవి తాజాగా మలయాళం మూవీ లూసిఫర్ సినిమా రీమేక్‌లో నటించనున్నాడు.

Megastar-Godfather:రీమేక్ సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన చిరంజీవి తాజాగా మలయాళం మూవీ లూసిఫర్ సినిమా రీమేక్‌లో నటించనున్నాడు. ఈ సినిమాను తెలుగులో గాడ్‌ఫాదర్‌గా తెరెకెక్కిస్తున్నారు డైరెక్టర్ మోహన్ రాజ్. ఈ కథకు సంబంధించి తెలుగు ప్రేక్షకులకు అనుకూలంగా మరికొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు మరో దర్శకుడు నూరీ జగన్నాథ్.
కొణిదెల ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది. గాడ్‌ఫాదర్ చిత్రంలో చిరంజీవి చెల్లెలి పాత్రకు సీనియర్ నటి రమ్యకృష్ణను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ పాత్ర కోసం ముందుగా బాలీవుడ్ నటి విద్యాబాలన్‌ని అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల రమ్యకృష్ణను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రమ్య, తాజాగా సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీలోనూ ఓ పవర్ ఫుల్ పాత్రలో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. ఇది వరకు కొన్ని సినిమాల్లో హీరో హీరోయిన్లుగా జోడీ కట్టిన చిరంజీవి, రమ్యకృష్ణలను.. అన్నా చెల్లెళ్లుగా అంటే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
RELATED STORIES
Plastic Exchange: నో మనీ.. ప్లాస్టిక్ వ్యర్థాలతో నచ్చిన వస్తువులు...
4 July 2022 6:48 AM GMTGold and Silver Rates Today : నిలకడగా బంగారం, వెండి ధరలు..
4 July 2022 5:44 AM GMTToyota Urban Cruiser: టయోటా అర్బన్ క్రూయిజర్.. ఫీచర్లు, ధర చూస్తే..
2 July 2022 12:00 PM GMTGold and Silver Rates Today : పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు.. ఈ...
2 July 2022 5:58 AM GMTPatil Kaki : అమ్మనేర్పించిన వంట ఆమెను కోటీశ్వరురాలిని చేసింది.. పాటిల్ ...
1 July 2022 12:30 PM GMTApple iPhone: ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారీ తగ్గింపు
1 July 2022 8:37 AM GMT