Megastar Chiranjeevi : శంకర వరప్రసాద్ మేకోవర్ అదిరిందయ్యా

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ గా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రూపొందుతోన్న సినిమా టైటిల్ గ్లింప్స్ ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ‘మన శంకర వరప్రసాద్ గారు’అనే టైటిల్ ను ఫిక్స్ చేశాడు అనిల్ రావిపూడి. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అనిల్ ఆల్రెడీ ఈ సంక్రాంతికి వెంకటేష్ తో బిగ్గెస్ట్ హిట్ కొట్టి ఉన్నాడు. అదీ కాక అతని సినిమాల్లోని ఎంటర్టైన్మెంట్ కు మెగాస్టార్ టైమింగ్ తోడైతే బాక్సాఫీస్ షేక్ అవుతుందనుకుంటున్నారు. ఇక ఈ గ్లింప్స్ ను చూస్తేనే అనిల్ తను చెప్పినట్టుగానే చిరంజీవిని వింటేజ్ స్టైల్లో ప్రెజెంట్ చేయబోతున్నాడు అని అర్థం అవుతోంది. అనిల్ రావిపూడి మెగాస్టార్ ను ఇంటిలిజెంట్ ఆఫీసర్ గా చూపించబోతున్నాడట. ఇలాంటి పాత్ర చిరంజీవికీ కాస్త కొత్తే అని చెప్పాలి. నిజంగా ఈ మేకోవర్ చూస్తే చిరంజీవి 40స్ లుక్ లా కనిపిస్తోంది. ఆ రేంజ్ లో మేకోవర్ చేశారు. సింపుల్ గా చెబితే అదిరిపోయింది అనే చెప్పాలి.
ఇంతకు ముందు బాబీ వాల్తేర్ వీరయ్య లో ఆయన్ని వింటేజ్ మాస్ స్టైల్ లో చూపించి ఫ్యాన్స్ చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇప్పుడు అనిల్ కాస్త క్లాస్ గా చూపించబోతున్నాడేమో అనిపిస్తోంది. అలాగే మాస్, యాక్షన్ కూడా ఉంటుందని చెప్పాడు. మరో విశేషం ఏంటంటే.. ఈ చిత్రంలో వెంకటేష్ కూడా ఓ కేమియో రోల్ చేస్తున్నాడు. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఇంతకు ముందు నయన్ చిరంజీవితో సైరా మూవీలో జోడీగా, గాడ్ ఫాదర్ లో చెల్లిగా నటించింది. ఫస్ట్ టైమ్ రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ గా ఆయన సరసన చిందేయబోతోంది. కేథరీన్ థ్రెస్సా మరో హీరోయిన్ గా కనిపించబోతోంది. అనిల్ కు బాగా కలిసొచ్చిన భీమ్స్ సిసిరోలియోనే ఈ చిత్రానికీ సంగీత దర్శకుడుగా తీసుకున్నాడు. షైన్ స్క్రీన్, గోల్డ్ బాక్స్ బ్యానర్స్ లో సాహు గారపాటి, సుష్మిత కొణెదల నిర్మిస్తున్నారీ చిత్రాన్ని. మొత్తంగా బాస్ ను 40ల్లోకి తీసుకువెళ్లి ఓ మ్యాజిక్ నే చేశాడు అనిల్ రావిపూడి. మరి ఈ మ్యాజిక్ కు 2026 సంక్రాంతికి బాక్సాఫీస్ ఎంత షేక్ అవుతుందో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com