Megastar Mega Donation : మెగాస్టార్ మెగా విరాళం

Megastar Mega Donation :  మెగాస్టార్ మెగా విరాళం
X

తెలుగు రాష్ట్రాల్లో వరద భీబత్సానికి ప్రజలు అల్ల కల్లోలం సృష్టించింది. తక్కువ జిల్లాలే అయినా ఎక్కువ నష్టం జరిగింది. అనేక ఊళ్లు నేలమట్టం అయ్యాయి. ఈ ప్రకృతి విళయానికి జనాలు అల్లాడుతున్నారు. వారిని ఆదుకోవడానికి సినిమా ఇండస్ట్రీ ముందుకు వచ్చింది. ఇప్పటికే ఎన్టీఆర్, బాలకృష్ణ, మహేష్ బాబు లాంటి స్టార్స్ తలా కోటి రూపాయలు ప్రకటించారు. ఈ కోటి రెండు రాష్ట్రాలకు చెరో 50 లక్షలుగా ప్రకటించారు. సిద్ధు జొన్నలగడ్డ రెండు రాష్ట్రాలకు చెరో 15 లక్షలు, విశ్వక్ సేన్ 5 లక్షల చొప్పున ప్రకటించారు. హీరోయిన్ అనన్య నాగళ్ల తన వంతుగా రెండు రాష్ట్రాలకు చెరో 2.5 లక్షలు ప్రకటించింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు.

చిరంజీవి తన వంతుగా రెండు రాష్ట్రాలకు చెరో 50 లక్షలు ప్రకటించాడు. ఈ సందర్భంగా జరిగిన నష్టంపై తన ఫీలింగ్ ను ఇలా పంచుకున్నాడు.

‘‘తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం వుంది. ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాల లో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు చిరంజీవి.

Tags

Next Story