Chiranjeevi : మెగాస్టార్ వింటేజ్ లుక్ అదిరిపోయిందా..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మన శంకరవర ప్రసాద్ గారు. ఈ మూవీ ట్రైలర్ అదిరిపోయింది. చూడగానే ఆకట్టుకునేలా ట్రైలర్ ను కట్ చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. దర్శకుడుగా అనిల్ రావిపూడి ఇప్పటి వరకు అపజయం లేకుండా పోయింది. అదే ఈ సారి కూడా రిపీట్ కాబోతోంది అనిపించేలా ఉన్నాడు. చిరంజీవితో ఫస్ట్ టైమ్ చేసిన మూవీ కాబట్టి అతను ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాడు అనిపించేలా ఉంది. మరోవైపు చిరంజీవి ట్రైలర్ లాంచ్ కు రాలేకపోయాడు. అంతే కాదు కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడట. అందుకే ప్రమోషన్స్ పై కూడా భారం పడింది అనిల్ పై.
అయితే ఆ భారాన్ని మర్చిపోయేలా ట్రైలర్ అందించాడు అనిల్. ఈ పాత్ర గురించి ఎక్కడో చూసినట్టుగా ముందుగా అనిపించినా.. అందులో మెగాస్టార్ లుక్, టైమింగ్, ఎక్స్ ప్రెషన్స్ మాత్రం అదిరిపోయాయి అనిపించేలా ఉన్నాడు. నయనతార పాత్ర అద్భుతంగా సెట్ కాబోతోంది అనిపించేలా పాత్ర రాసుకున్నాడు. ఆ క్యారెక్టర్ కూడా నయన్ అదిరిపోయింది. మెగాస్టార్ తో మూవీ అంటే మాటలా అంటే.. మాటలు కాదు.. పంచ్ లు అనిపించేంతలా నవ్వించే ప్రయత్నించాడు. అదే టైమ్ లో యాక్షన్ కూడా అదరగొట్టాడు అనిపించేలా ఉన్నాడు. అంటే చిరంజీవి పాత్ర చూస్తే.. ఇంట్లో పిల్లిలా ఉంటూ.. బయట పులిలా అనిపించే పాత్రలా ఉండబోతోంది. ఇక వెక్టరీ వెంకటేష్ క్యారెక్టర్ ఏంటీ.. ఎందుకు ఎంట్రీ ఇచ్చింది అనేది కూడా సినిమాలో ఇంట్రెస్టింగ్ గా ఉండేలా అనిపించాడు. అలాగే ఇద్దరివీ సింగిల్ డైలాగ్ అని అదిరిపోయాయి అనిపించేలా చేశాడు.
మొత్తంగా అనిల్ రావిపూడి ఈ సారి కూడా ఏ మాత్రం డిజప్పాయింట్ చేయడు అనిపించేలా ఉన్నాడు. ఇంకా చెబితే ఇప్పటి వరకు మూవీస్ కంటే కూడా కాస్త ఎక్కువగా ఆకట్టుకునేలా ఉన్నట్టున్నాడు. ఫైనల్ గా మెగాస్టార్ వింటేజ్ లుక్ మాత్రం బావుంది. పాత్రగా ఎలా ఉంటుంది అనేది మాత్రం అప్పుడే చెప్పలేం కానీ.. ఈ లుక్ తో పాటు అతని మ్యానరిజం, టైమింగ్స్ మాత్రం అద్దిరిపోయేలా చేశాడు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

