Chiranjeevi : రామయ్య పాటతో హనుమ భక్త చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా ‘విశ్వంభర’.బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. త్రిష హీరోయిన్. కునాల్ కపూర్, అషికా రంగనాథ్, సురభి, ఇషాచావ్లా ఇతర పాత్రల్లో నటించారు. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విఎఫ్ఎక్స్ క్వాలిటీతో రాలేదని రిలీజ్ ఆపేశారు. కొత్త డేట్ గా జూలై 24 అని వినిపిస్తోంది. ఇక ఆ డేట్ కు కొంత టైమ్ ఉన్నా.. సినిమా నుంచి అప్డేట్స్ స్టార్ట్ అయ్యాయి. విశ్వంభర నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను ఈ 12న విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు.
అనౌన్స్ మెంట్ తో పాటు రిలీజ్ చేసిన ప్రోమో చూస్తే మెగాస్టార్ శ్రీరామనవమి సందర్భంగా పాడుకునే పాటలాగా కనిపిస్తోంది. అఫ్ కోర్స్ ఆ పాటకు తగ్గ స్థాయిలోనే గ్రాండీయర్ కూడా ఉండబోతోందని అర్థం అవుతోంది. జై శ్రీరామ్ అంటూ చిరంజీవి సొంత గొంతుతో ఎలుగెత్తి నినదించిన విధానం బావుంది. మరి పాట ఎలా ఉంటుందో కానీ.. ఈ పాటతో సినిమాకు ఇప్పటి వరకూ ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయోమో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com