జూనియర్ 'చిరు' పేరును రివీల్ చేసిన మేఘనారాజ్..

జూనియర్ చిరు పేరును రివీల్ చేసిన మేఘనారాజ్..
ఇంతకుముందు మలయాళం, కన్నడ చిత్రాలలో మేఘన నటించింది. పెళ్లైన తరువాత నటనకు దూరంగా ఉన్న ఆమె తిరిగి సెట్స్‌కి ..

దివంగత నటుడు చిరంజీవి సర్జా భార్య మేఘన రాజ్ సర్జా తన కుమారుడి పేరును సోషల్ మీడియాలో వెల్లడించారు. మేఘన, చిరంజీవి సర్జా వివాహ దృశ్యాలను కలిగి ఉన్న వీడియోలో, ఆమె తన కుమారుడికి రాయన్ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. మేఘన తన పది నెలల కుమారుడిని ముద్దుగా చింటూ, సింబా అని పిలుచుకుంటారు. సోషల్ మీడియాలో చాలా మంది సర్జా అభిమానులు మేఘనాను కుమారుడి పేరు వెల్లడించమంటూ ఆసక్తి కనబరిచారు. కొడుకు పేరు కోసం ఇన్ని రోజులు ఆలోచించిన మేఘన ఫైనల్‌గా రాయన్ అని సెలెక్ట్ చేసినట్లు తెలిపారు.

కాగా తెలుగులో బెండు అప్పారావు, లక్కీ తదితర చిత్రాల్లో నటించిన మేఘన.. చిరంజీవి సర్జాతో 'ఆటగార', 'రామ్‌లీలా' వంటి చిత్రాల్లో నటించారు. ఆ సినిమాల సమయంలో ప్రేమలో పడ్డ ఈ ఇద్దరూ 2018లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన రెండేళ్లకే మేఘన భర్త చిరంజీవి సర్జా, జూన్ 7, 2020, 39 సంవత్సరాల వయస్సులో గుండెపోటు కారణంగా మరణించారు. అతని మరణ సమయంలో, మేఘన ఐదు నెలల గర్భవతి.ఇంతకుముందు మలయాళం, కన్నడ చిత్రాలలో మేఘన నటించింది. పెళ్లైన తరువాత నటనకు దూరంగా ఉన్న ఆమె తిరిగి సెట్స్‌కి వచ్చినట్లు సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం పలు ప్రకటనల్లో పని చేస్తున్న ఆమె రాబోయే రోజుల్లో సినిమాల్లో నటించే అవకాశం ఉంది.

మేఘన తరచుగా కొడుకు రాయన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడానికి ఇష్టపడుతుంది. రాయన్‌కు ఆరు నెలల వయస్సు వచ్చినప్పుడు ఆ వేడుకను కూడా అభిమానులతో పంచుకున్నారు మేఘన.

Meghana Raj,Chiranjeevi Sarja,Movie News,Kollywood,మేఘనా రాజ్‌, చిరంజీవి సర్జా,సర్జా నటించిన చివరి చిత్రం రణం. ఆయన మరణానంతర సినిమా విడుదలల సినిమా ప్రమోషన్లలో మేఘన పాల్గొంది. మేఘన ఒక వీడియోను విడుదల చేసింది. రణం చూడాలని అభిమానులను కోరింది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, చిరంజీవి సర్జా ప్రధాన పాత్రల్లో నటించారు.

Tags

Read MoreRead Less
Next Story