మెహ్రీన్‌ని ప్రేమించాను.. పెళ్లి చేసుకోవాలనుకున్నాను.. కానీ.. : భవ్య బిష్ణోయ్

F2 పిల్ల మెహ్రీన్ పిర్జాడా ఎవర్ని పెళ్లి చేసుకుంటుందో.. భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం జరిగిన నాలుగు నెలల తరువాత అదంతా తూచ్.. క్యాన్సిల్ అని ప్రకటించింది. ఈ వార్తను మెహ్రీన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. మా బ్రేకప్ స్నేహపూర్వకంగా జరిగింది. ఇకపై భవ్య కుటుంబంతో కానీ వారి స్నేహితులతో కానీ తనకు సంబంధం లేదని పేర్కొంది.
ఈ సంఘటన గురించి తాను ఇకపై మాట్లాడనని ఆమె తన పోస్ట్‌లో స్పష్టం చేసింది. దయచేసి ఈ విషయాన్ని మీడియా పెద్దది చేయొద్దని అభ్యర్థించింది. కరోనా సీజన్ అని కళ్యాణాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నారు. కానీ ఈ నాలుగు నెలల కాలంలో ఏం జరిగిందో.. ఎవరికి ఎవరు బాగా అర్థమయ్యారో తెలియదు కానీ నిశ్చితార్థాన్ని విరమించుకున్నారు.
రాజకీయ నాయకుడు కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడు భవ్య బిష్ణోయ్.. నటి మెహ్రీన్‌తో జీవితాన్ని పంచుకోవాలనుకున్నారు. కానీ అది నిశ్చితార్ధంతోనే ఆగిపోయింది. అయితే తమ బ్రేకప్ స్నేహపూర్వకంగానే జరిగిందని, తమ కుటుంబం ఆమెని ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేదని భవ్య పేర్కొన్నారు. కొంత మంది మా కుటుంబం గురించి తప్పుడు వార్తలు రాస్తున్నారు.
ఈ విషయంపై తాను ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఎవరైనా అబద్ధాలు ప్రచారం చేస్తే వారిపై వ్యక్తిగతంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని భవ్య అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com