Allu Arjun: 'మెన్ ఆఫ్ ద ఇయర్' అవార్డందుకున్న 'పుష్పరాజ్'

Allu Arjun: మెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డందుకున్న పుష్పరాజ్
Allu Arjun: ఒక్క హిట్ వరల్డ్ వైడ్ గా ఫేమస్ చేయడం చాలా రేర్ గా జరుగుతుంది. కానీ ఈ మధ్య రాజమౌళి వల్ల మన తెలుగు స్టార్స్ ఆ ఫేమ్ ను సంపాదిస్తున్నారు.

Allu Arjun: ఒక్క హిట్ వరల్డ్ వైడ్ గా ఫేమస్ చేయడం చాలా రేర్ గా జరుగుతుంది. కానీ ఈ మధ్య రాజమౌళి వల్ల మన తెలుగు స్టార్స్ ఆ ఫేమ్ ను సంపాదిస్తున్నారు. బట్ రాజమౌళి కాకుండా సుకుమార్ ద్వారా ప్రపంచానికి గ్రాండ్ గా పరిచయం అయ్యాడు అల్లు అర్జున్.



ఏ ముహూర్తంలో పుష్ప మూవీ సెట్ అయిందో కానీ.. ఆ మూవీ వచ్చి యేడాది అవుతున్నా.. ఆ ఫీవర్ తగ్గలేదు. ముఖ్యంగా ఈ మూవీతో అల్లు అర్జున్ కు వరుసగా ఓ రేంజ్ అవార్డ్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ అందుకున్న ఈ ఐకాన్ స్టార్ కు లేటెస్ట్ గా మరో రేర్ అవార్డ్ వచ్చింది. విశేషం ఏంటంటే.. ఈ అవార్డ్ అందుకున్న ఫస్ట్ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్. మరి ఈ స్పెషల్ అవార్డ్ మేటర్ ఏంటో చూద్దాం..


అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప ది రైజ్ దేశవాప్తంగా రికార్డులను సృష్టించింది. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ పాన్‌ ఇండియా హీరోగా ఎదిగి.. ఐకాన్‌ స్టార్‌ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న ఈ మూవీ.. లెటెస్ట్ గా మరో అవార్డ్ ను అందుకుంది.



2022 సంవత్సరానికి గాను GQ మ్యాగజైన్ లీడింగ్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అల్లు అర్జున్ కు అందించింది. విశేషం ఏంటంటే.. ముంబై బేస్డ్ గా ఉండే వీళ్లు టీమ్ అంతా కలిసి హైదరాబాద్ వచ్చి మరీ అల్లు అర్జున్ కు ఈ అవార్డ్ అందించారు. మెన్ ఆఫ్‌ ద ఇయర్ పేరిటి ప్రతి యేడాది వీళ్లు ఈ అవార్డ్స్ ను ఫ్యాషన్, కల్చర్, పాలిటిక్స్ విభాగాల్లో అత్యధిక ప్రతిభ కనబర్చిన వాళ్లకు ఈ అవార్డ్స్ అందజేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అల్లు అర్జున్‌ ఈ అవార్డు అందుకున్నాడు.



మొత్తంగా పుష్ప సినిమా అల్లు అర్జున్ కు తిరుగులేని క్రేజ్ తెచ్చిందనే చెప్పాలి. మామూలుగా సినిమాలు రెవెన్యూ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తుంటాయి. ఇలా అవార్డులు, రివార్డుల పరంగా రికార్డులు క్రియేట్ చేయడం అరుదు అనే చెప్పాలి. ఎందుకంటే ఈ చిత్రం కోసం ఆల్రెడీ సిఎన్ఎన్ 18 ఇండియన్ ఆఫ్‌ ద ఇయర్, ఫిలిమ్ ఫేర్, సైమా వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్నాడు అల్లు అర్జున్. ఇప్పుడీ లీడింగ్ మేన్ అవార్డ్ ను టాలీవుడ్ అందుకున్న ఫస్ట్ టాలీవుడ్ హీరో కావడం కూడా మరో రికార్డే. మొత్తంగా ఈ అవార్డ్ కు తనను ఎంపిక చేసిన జీక్యూ టీమ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు అల్లు అర్జున్‌.

బాబూరావు.కె

Tags

Read MoreRead Less
Next Story