Uma Maheshwari : బుల్లితెర నటి కన్నుమూత..!

Uma Maheshwari : తమిళ బుల్లితెర నటి ఉమా మహేశ్వరి కన్నుమూశారు. నిన్న (2021 అక్టోబర్ 17) చెన్నైలో కన్నుమూశారు. ప్రస్తుతం ఆమెకు 40 ఏళ్లు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెకు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. అమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
మొట్టి ఒళి టీవీ సీరియల్ ద్వారా ఉమా మహేశ్వరి మంచి ఫేం సంపాదించుకున్నారు. ఇందులో ఆమె విజయలక్ష్మి అనే పాత్రను పోషించారు. తమిళ సీరియల్స్ లో అత్యంత ప్రజాదరణ పొందింది ఇది.. 2002 నుండి 2005 వరకు ప్రసారం అయింది. దాదాపుగా ఈ ధారావాహిక సన్ టీవీలో 800 ఎపిసోడ్‌లకు పైగా నడిచింది.
కోవిడ్ -19 లాక్‌డౌన్ సమయంలో అభిమానుల కోరిక్ మేరకు దీనిని మరోసారి ప్రసారం కూడా చేశారు. ఈ సీరియల్ తో పాటుగా ఒరు కధాయిన్ కధాయ్, మంజల్ మగిమై వంటి సీరియల్స్‌లో కూడా నటించారు.వివాహం అనంతరం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఆమె భర్త పేరు మురుగన్ కాగా ఆయన పశువైద్యుడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com