Mike Tyson in Liger: వాట్ ఏ కాంబినేషన్.. విజయ్ vs మైక్ టైసన్

Mike Tyson in Liger: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda).. ప్రస్తుతం యూత్‌లో అత్యంత క్రేజ్ ఉన్న హీరో. సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేయడంతో మొదలైన తన కెరీర్.. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ చేసేంతవరకు వచ్చింది. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్(Liger) అనే పాన్ ఇండియా సినిమాలో విజయ్ నటిస్తున్నాడన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో విజయ్ ఒక బాక్సర్‌గా కనిపించనున్నాడని ఫస్ట్ లుక్ ద్వారా స్పష్టమయింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నా కూడా లైగర్ నుండి ఇప్పటివరకు విజయ్ ఫ్యాన్స్‌ను ఎక్సైట్ చేసే న్యూస్ ఇప్పటివరకు రాలేదు.
కానీ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఛార్మి మాత్రం ఎవరూ ఊహించని అప్డేట్ రానుందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉంది. దానికి తగినట్టుగానే ఈరోజు ఒక క్రేజీ అప్డేట్ బయటికొచ్చింది. లైగర్ సినిమాలో వరల్డ్ క్లాస్ బాక్సర్ మైక్ టైసన్(Mike Tyson) నటించనున్నాడని మూవీ టీమ్ ఒక పోస్టర్ ద్వారా స్పష్టం చేసింది. ఇందులో ఆయన ఎలాంటి పాత్రలో కనిపించనున్నాడన్న విషయాలు ఏమీ వెల్లడించకపోయినా ఈ అప్డేట్ మాత్రం ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com