Aryan Khan Drugs Case: ఆర్యన్ ఖాన్ కేసుపై మంత్రి హాట్ కామెంట్స్..

Aryan Khan Drugs Case: ఆర్యన్ ఖాన్ కేసుపై మంత్రి హాట్ కామెంట్స్..
Aryan Khan Drugs Case: ముంబై క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసు విషయంలో మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ మరో సంచలన ఆరోపణలు చేశారు

Aryan Khan Drugs Case: ముంబై క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసు విషయంలో మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ మరో సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో ఆర్యన్‌ ఖాన్‌ అరెస్ట్‌ వెనుక బీజేపీ నేత ప్రమేయం ఉన్నదని మాలిక్ ఆరోపించారు. ఈ కేసు పూర్తిగా అపహరణ, డబ్బు డిమాండ్‌కు సంబంధించింది మాత్రమేనని వ్యాఖ్యానించారు నవాబ్ మాలిక్.

అంతే కాకుండా ఆర్యన్ ఖాన్‌ను పలువురు కిడ్నాప్ చేయాలనుకున్నారని, అందుకే వీటిలో కావాలని తనను ఇరికించారని నవాబ్ అన్నారు. అంతే కాకుండా తానేమీ ఊహించి మాట్లాడట్లేదని, తాను చెప్పేవన్నీ నిజాలని బల్లగుద్ది చెప్పారు. సమీర్ వాఖనాడేపై కూడా నవాబ్ మాలిక్ చేసిన కామెంట్స్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

Tags

Next Story