Mirai teaser : టీజర్ తో లెక్కలు మార్చేసిన తేజ సజ్జా

Mirai teaser :  టీజర్ తో లెక్కలు మార్చేసిన తేజ సజ్జా
X

పిట్ట కొంచెం కూత ఘనం అంటుంటారు కదా.. తేజ సజ్జా విషయంలో ఇది వర్తిస్తుంది అని చెప్పాలి. బాల నటుడుగా ఆకట్టున్నవాళ్లెవరూ తర్వాత మాస్ హీరోలుగా మెప్పించలేదు. బట్ తేజ సజ్జా హను మాన్ తో అది సాధించాడు. కాకపోతే ఇది హనుమంతుడి పవర్ వల్ల సాధ్యమైంది అనుకున్నారు. బట్ తనలోనూ ఆ పవర్ ఉందని తాజాగా వచ్చిన ‘మిరాయ్’టీజర్ తో ప్రూవ్ చేసుకున్నాడు. టీజర్ చిన్నదే. కానీ దీని ఇంపాక్ట్ మాత్రం ఎవరూ ఊహించలేనంత రేంజ్ లో ఉందనేది వాస్తవం. విజువల్ ఎఫెక్ట్స్ చూస్తుంటే మరోసారి తేజ సజ్జా నుంచి ఓ సూపర్ హీరో కంటెంట చూడబోతున్నాం అనేది ఫిక్స్ అయింది. అశోకుడి కాలం నాటి కథను ఈ కాలానికి ముడి పెడుతూ.. ప్రపంచాన్ని అంతం చేయాలనుకున్న ఓ దుష్ట శక్తిని ఎదుర్కొనేందుకు ఓ సామాన్య యువకుడు మిరాయ్ అనే ఆయుధంతో ఆ దుష్టుడిని ఎలా ఢీ కొట్టాడు.. అతను ఎలా యోధుడయ్యాడు అనే పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ.

టీజర్ తో కథ అర్థం అవుతుంది. కానీ ఆ కథను చెప్పబోతున్న తీరే ప్రేక్షకులను కొత్త లోకానికి తీసుకువెళ్లేలా కనిపిస్తోంది. ‘జరగబోయేది మారణహోమం. శిథిలం కాబోతోంది అశోకుడి ఆశయం.. కలియుగంలో పుట్టిన ఏ శక్తీ.. దీన్ని ఆపలేదు.. ’ అనే డైలాగ్ తో ప్రారంభమైన టీజర్ లో ఈ పార్ట్ మొత్తం మంచు మనోజ్ విశ్వరూపం కనిపిస్తోంది. మహవీర్ రెహమాన్ అనే పాత్రలో అతను కనిపించబోతున్నాడని తెలుస్తోంది. మనోజ్ కు ఇది కెరీర్ ను టర్న్ తిప్పే పాత్ర అవుతుందనేలా ఉంది.. ‘ఇక ఈ ప్రమాదాన్ని ఆపే దారే లేదా..’ అనే డైలాగ్ కు.. ‘ఈసారి దారి దైవం కాదు.. యుగాల వెనక అవతరించిన ఓ ఆయుధం చూపిస్తుంది.. అదే మిరాయ్’అనే డైలాగ్ తో ఎంటర్ అయిన తేజ సజ్జా.. స్క్రీన్ ప్రెజెన్స్.. యాక్షన్ లో ఈజ్ అదిరిపోయాయి. మొత్తంగా హను మాన్ తర్వాత తేజ సజ్జా ఈ మూవీతో టాలీవుడ్ కు ఓ పర్ఫెక్ట్ సూపర్ మేన్ కాబోతున్నాడనిపించేలా ఉందీ టీజర్.

తేజ సరసన కార్తీక నాయర్ హీరోయిన్ గా నటించింది. ఇతర పాత్రల్లో జగపతిబాబు, మంచు మనోజ్, జయరాం, శ్రియ శరణ్, పవన్ చోప్రా, టాంజా కెల్లర్ తదితరులు నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్నాడు. సెప్టెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు ఈ టీజర్ తో పాటే ప్రకటించారు.



Tags

Next Story