Mirai Trailer : ఆ ప్రమాదం ఆపాలంటే మిరాయ్ ని చేరుకోవాలి..

Mirai Trailer :  ఆ ప్రమాదం ఆపాలంటే మిరాయ్ ని చేరుకోవాలి..
X

హను మాన్ తో ఓవర్ నైట్ సూపర్ హీరో అయిపోయాడు తేజా సజ్జా. బాల నటుడు నుంచి ఇంత స్టార్డమ్ తెచ్చుకున్నవాళ్లలో మహేష్ బాబు తర్వాత ఇతనే చేరతాడేమో. హను మాన్ తర్వాత ఇప్పుడు మరోసారి సూపర్ హీరో సబ్జెక్ట్ తోనే మిరాయ్ అంటూ వస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. కార్తీక నాయక్ హీరోయిన్. సెప్టెంబర్ 12న విడుదల కాబోతోన్న మిరాయ్ ట్రైలర్ విడుదల చేశారు. ఇంతకు ముందే వచ్చిన టీజర్ చూస్తే విజువల్ వండర్ లా ఉండొచ్చు అనిపించింది. అది నిజమే అని చెబుతూనే.. మైథలాజికల్, ఫాంటసీ కంటెంట్ తో ఈ చిత్రం ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.

ఓ సాధారణ కుర్రాడు.. తన చుట్టూ ఉండేవారికి ఆపద వస్తే ఆదుకుంటూ ఉంటాడు. అలాంటి వ్యక్తికి ఈ లోకాన్నే కాపాడే అభ్యర్థన వస్తుంది. మొదట కాదు అన్నా.. తర్వాత తనే అది చేయగలడు అనిపించి ఆ ప్రయత్నం మొదలు పెడతాడు. ఒక తొమ్మిది గ్రంథాల్లో ఉన్న రహస్యానికి సంబంధించిన కథ అని కూడా ముందే చెప్పారు. అందుకు తగ్గట్టుగానే.. ఆ గ్రంథాలకు సంబంధించి ఒక ప్రమాదం ఏర్పడుతుంది. ఆ ప్రమాదాన్ని ఆపాలంటే మిరాయ్ ని చేరుకోవాలి. ఆ ఆయుధంతోనే చెడును అంతం చేయగలరు. తేజ సజ్జా మిరాయ్ ని చేరుకుని ఈ లోకానికి ఏర్పడిని సమస్యను తొలగించాడా లేదా అనేది ట్రైలర్ లోనే చెప్పారు. అయితే దీనికి మైథాలజీని యాడ్ చేస్తూ శ్రీ రాముడు అతనికి అన్ని వేళలా అండగా నిలిచాడు అని చెప్పించడం సూపర్బ్ గా ఉంది. పైగా ఆ రాముడు ఎవరు అనే ప్రశ్నే లేకుండా కల్కిలో కృష్ణుడులా చూపించారు. అంటే ఫేస్ కనిపించదు. ఆహార్యం చూడగానే ఆయన రాముడు అని తెలిసేలా ఉంటుందన్నమాట. చూస్తే మిరాయ్ ట్రైలర్ మెస్మరైజింగ్ గానే ఉంది. కాకపోతే ఏదో లోపించిన భావన కూడా కలుగుతుంది. విజువల్ గా అదిరిపోయింది. విలన్ పాత్ర చేస్తోన్న మంచు మనోజ్ కు ఇది కెరీర్ టర్నింగ్ సినిమా అయ్యే అవకాశాలున్నాయనిపిస్తోంది. కొన్ని హాలీవుడ్ మూవీస్ రిఫరెన్స్ కూడా ఉన్నట్టుగా ఉన్నా.. దీనికి మన పౌరాణికాల టచ్ యాడ్ అవుతుంది కాబట్టి కంటెంట్ పరంగా ప్రాపర్ ఇండియన్ మూవీగా నిలిచే అవకాశాలున్నాయి.

ఇక తేజ సజ్జాకు తల్లిగా నిన్నటి స్టార్ హీరోయిన్ శ్రీయ కనిపించడం విశేషం. ఇతర పాత్రల్లో హీరోయిన్ గా కార్తీక నాయక్ ది బలమైన పాత్రలానే కనిపిస్తుంది. జగపతి బాబు, జయరాం సపోర్టింగ్ రోల్స్ లో ఉన్నారు.

గౌర హరి సంగీతం అందిస్తోన్న మిరాయ్ కి టెక్నికల్ గా బలమైన సపోర్ట్ కూడా తోడైనట్టు కనిపిస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ బావున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చూస్తుంటేనే ఈ చిత్రంపై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎంత కాన్ఫిడెంట్ గా ఉందో అర్థం అవుతుంది. ఇక ఇతర భాషల్లో కూడా పేరున్న సంస్థలు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాయి. హిందీలో ధర్మా ప్రొడక్షన్స్, కన్నడలో హొంబలే ఫిల్మ్స్, తమిళ్ లో ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్, మళయాలంలో శ్రీ గోకుల్ మూవీస్ వంటి భారీ సంస్థలు రిలీజ్ చేస్తున్నాయి. మొత్తంగా సెప్టెంబర్ 12న ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే తేజ సజ్జా ఇండియన్ సూపర్ హీరో మూవీస్ కు ఐకన్ గా నిలిచిపోతాడు.

Tags

Next Story