Miss Shetty Mr Polishetty : కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. అనుష్క ఫ్యాన్స్ కు పండగే

Miss Shetty Mr Polishetty : కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. అనుష్క ఫ్యాన్స్ కు పండగే
X
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్

జాతిరత్నాలతో పాపులారిటీ తెచ్చుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటిస్తోన్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కానుందని వెల్లడించారు. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ బాబు.పి ద‌ర్శ‌క‌త్వంలో వంశీ, ప్ర‌మోద్‌ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా హీరో నవీన్ పోలిశెట్టి చేసిన స్పెషల్ వీడియో ప్రస్తుతం ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో జ్యోతిష్యుడు రంగస్థలం మహేశ్ ను 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' రిలీజ్ డేట్ చెప్పమని అడగడం. అతను 70,80 ఏళ్ల తర్వాత రిలీజ్ చేసుకోమని అనడం.. చివరకు నవీన్ పోలిశెట్టి హే కృష్ణా అంటూ ఉట్టికొట్టి కృష్ణాష్టమికి మా సినిమాను తీసుకొస్తున్నాం అని ప్రకటించడం ఇంట్రెస్టింగ్ గా, హ్యూమర్ ను క్రియేట్ చేసేలా ఉంది.

ఇక గత కొంత కాలం నుంచి సినిమాలకు గ్యాప్ ఇచ్చిన అనుష్క.. ఈ సినిమాతో మళ్లీ వెండితెరపై కనిపించనుండడంతో అభిమానులు.. ఈ సినిమాపై అత్యంత ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా వచ్చిన ఈ అనౌన్స్ మెంట్ ఆడియన్స్ లో మరింత ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలకు మంచి స్పందన రాగా.. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సెప్టెంబర్ 7న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. సెప్టెంబర్ 6, 7 తేదీల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం ఉండటంతో సినిమా చూసేందుకు ఈ హాలీడేస్ ఆడియెన్స్ కు కలిసిరానున్నాయి. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుందని కూడా మేకర్స్ ఆశిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ప్రమోషన్స్‌లో భాగంగా గత కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాకు రాధన్ సంగీతం అందిస్తుండగా యువీ క్రియేషన్స్ సంస్థ పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్ట్ 4న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే పోస్ట్ ప్రోడక్షన్ పనుల పూర్తి కానీ నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఓ నోట్‌ను విడుదల చేస్తూ.. సినిమా విడుదల వాయిదా పడ్డట్లు అప్పట్లో క్లారిటీ ఇచ్చింది కూడా. ఈ క్రమంలోనే తాజాగా కొత్త డేట్ ను రిలీజ్ చేసింది.


Tags

Next Story