'మిస్టేక్' ట్రైలర్ రిలీజ్
పలు సినిమాల్లో నటుడిగా మెప్పించి ఇటీవలే రామ్ అసుర్ సినిమాతో హీరోగా కూడా మెప్పించిన అభినవ్ సర్దార్ ఇప్పుడు మిస్టేక్ సినిమాతో రాబోతున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ భరత్ కొమ్మాలపాటి దర్శకత్వంలో అభినవ్ సర్దార్ హీరోగా ఆయన సొంత నిర్మాణంలో ASP బ్యానర్ పై మిస్టేక్ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.
తాజాగా మిస్టేక్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ దసపల్లా హోటల్ లో గ్రాండ్ గా జరిగింది. 100కి పైగా సినిమాల్లో మనందరినీ మెప్పించిన హీరో శ్రీకాంత్ మిస్టేక్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే బిగ్‌బాస్ ప్రముఖులు VJ సన్నీ, మానస్, సోహైల్, సింగర్ రేవంత్, నటుడు బెనర్జీ, లోహిత్ కుమార్, విక్రమాదిత్య, ఇన్‌కం ట్యాక్స్ కమిషనర్ జీవన్, లగడపాటి శ్రీధర్, చైతన్యకృష్ణ.. పలువురు సినీ, వ్యాపార ప్రముఖులు విచ్చేశారు. హీరో శ్రీకాంత్ ట్రైలర్ ని ఆవిష్కరించారు. యాక్షన్, కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో మిస్టేక్ ట్రైలర్ అందర్నీ మెప్పించింది. అభినవ్ సర్దార్ సిక్స్ ప్యాక్ తో చేసిన యాక్షన్ సీన్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com