Priyanka Singh: వాళ్లు చేసిన తప్పులే ప్రియాంక సింగ్‌కు కలిసొచ్చాయి..

Priynaka Singh: అందంతో అందర్నీ ఆకర్షించింది.. మంచితనంతో మనసుల్ని దోచుకుంది.. ట్రాన్స్‌జెండర్ అని చెబితేగానీ తెలియని ప్రియాంక సింగ్ మనిషి, మాట, మనసు అన్నీ ఆమెను బిగ్‌బాస్ హౌస్‌లో ఇన్ని రోజులు ఉండడానికి కారణమయ్యాయి. ఇన్ని రోజులు ఆమెని ఓ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నారు. కానీ ఇంతలోనే షో చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో ప్రియాంక ఎలిమినేట్ కావడం ఆమె అభిమానులను కలవరపరిచింది.
ఇంతకు ముందు సీజన్‌లో వచ్చిన తమన్నా సింహాద్రి మాదిరిగా ఈమె కూడా ఎక్కువ రోజులు హౌస్‌లో ఉండదనుకున్నారు అందరూ. కానీ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌ల్లో ఇరగదీసే అంత ఫెర్‌ఫామెన్స్ ఇవ్వకపోయినా విన్నయ్యేది. ఏ విషయంలోనూ జోక్యం చేసుకోకుండా, ఎవరితో గొడవ పడకుండా సేఫ్‌గా గేమ్ ఆడింది.. అందుకే ఇన్ని రోజులు హౌస్‌లో ఉంది అని అనేవాళ్లు కూడా లేకపోలేదు. పైగా ఆమెతో పోలిస్తే మిగతా కంటెస్టెంట్స్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్త ఎక్కువే.. ఒకానొక సమయంలో తాను ఎలిమినేట్ అయిపోతానేమోనని భయపడింది.
కానీ అందుకు భిన్నంగా 90 రోజులు హౌస్‌లో ఉంది. ఎలిమినేట్ అయిన వాళ్లందరూ ఎవరితో ఒకరితో చిన్న చిన్న విషయాలకే గొడవ పెట్టుకోవడంతో ప్రేక్షకులకు విసుగొచ్చి ఒన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ప్రియాంక అనుకుని ఆమెకు ఓట్లు వేసారు.. అలా ప్రియాంక నామినేషన్ నుంచి గట్టెక్కింది. అందరితో కలుపుగోలుగా ఉంటూ ఇన్ని రోజులు హౌస్‌లో ఉంటూ అందరి అభిమానాన్ని సంపాదించుకున్న ప్రియాంక వెళ్లి పోవడం ఒకరకంగా హౌస్‌మేట్స్‌ని బాధించింది. తన లైఫ్ జర్నీని పంచుకుని హౌస్‌లోని వారితో పాటు ప్రేక్షకులనూ కంటతడిపెట్టించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com