Mithra Mandali Teaser : హిలేరియస్ ఫన్ రైడ్ లా.. మిత్రమండలి టీజర్

Mithra Mandali Teaser :  హిలేరియస్ ఫన్ రైడ్ లా.. మిత్రమండలి టీజర్
X

కొన్నాళ్ల క్రితం స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్స్ గా మెప్పించిన వాళ్లంతా కలిసి ఇప్పుడు వాళ్లే హీరోలుగా సినిమాలు అదరగొడుతున్నారు. లేదంటే స్మాల్ హీరోలతో పాటు ఫుల్ లెంగ్త్ రోల్స్ చేస్తూ నాన్ స్టాప్ గా నవ్విస్తున్నారు. ప్రస్తుతం ఆ మొదటి లైన్ నుంచి రాబోతోన్న సినిమా ‘మిత్ర మండలి’. ప్రియదర్శి, నిహారిక, రాగ్ మయూర్, వెన్నెల కిశోర్, విష్ణు ఓయ్, సత్య ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ మిత్రమండలి టీజర్ విడుదలైంది. టీజర్ చూస్తుంటేనే నాన్ స్టాప్ ఫన్ రైడ్ గ్యారెంటీ అనేలా కనిపిస్తోంది. ప్రతి ఫ్రేమ్ లోనూ నవ్వించబోతున్నాం అని ముందే ప్రిపేర్ చేయడానికే ఈ టీజర్ రిలీజ్ చేశారా అనిపిస్తోంది. విజయేందర్ ఎస్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని బన్నీవాస్ సమర్పిస్తున్నాడు.

ఇక టీజర్ చూస్తే.. ఐపిఎల్ తెలుగు కామెంటరీ చెప్పినట్టుగా అనుకరిస్తూ సాగే వాయిస్ లో.. ఆవారాగా తిరుగుతూ ఉండే బ్యాచ్.. ప్రియదర్శి, విష్ణు, రాగ్ మయూర్.. ప్రతిసారీ ఏదో ప్రాబ్లమ్ తెచ్చుకుంటారు. బ్యాట్, బాల్ లేకండా క్రికెట్ ఆడటం, బోర్డ్ లేకుండా క్యారమ్స్ ఆడటం వీరి స్పెషాలిటి. అలా అందరినీ ఫూల్స్ చేస్తున్న వీరి లైఫ్ లోకి ఓ బాక్సింగ్ తెలిసిన అమ్మాయి వస్తుంది. ఇక పోలీస్ స్టేషన్ లో వెన్నెల కిశోర్, సత్య ఎంట్రీ చూస్తే ఇందులో సత్య పాత్రే చెప్పినట్టు అతను ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటున్నారు. బూతులు లేకుండానే ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్ద కమెడియన్స్ గా ఉన్న వీరితో సినిమా అంటే ఎలాంటి అంచనాలుంటాయో.. అందుకు తగ్గ కంటెంట్ తోనే దర్శకుడు వస్తున్నట్టు కనిపిస్తోంది.

ఇక సోషల్ మీడియా ఇన్ ఫ్లూయొన్సర్ గా చాలా అంటే చాలా ఫేమస్ అయిన నిహారిక రీసెంట్ గా తమిళ్ మూవీతో వెండితెరపై అడుగుపెట్టింది. ఈ మిత్ర మండలితో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. ఆ మధ్య మిషన్ ఇంపాజిబుల్ స్టార్ టామ్ క్రూయిజ్ తో కలిసి స్పెషల్ గా కనిపించి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన ఈ భామకు తెలుగులో మిత్ర మండలి ఎలాంటి స్వాగతం ఇస్తుందో చూడాలి.

Tags

Next Story