Mithun Chakraborty: అస్వస్థతకు గురైన సీనియర్ నటుడు.. ఆసుపత్రిలో ఉన్న ఫోటో వైరల్..

Mithun Chakraborty: ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి అస్వస్థతకు గురయ్యారు. ఆయన బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చేరినట్టు బీజేపీ నేత అనుపమ్ హజ్రా తెలిపారు. ఆయన ట్విట్టర్లో మిథున్ చక్రవర్తి ఫొటోను షేర్ చేసి.. త్వరగా కోలుకోవాలని కోరారు. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై మిథున్ చక్రవర్తి కుటుంబసభ్యులు స్పందించారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి అప్డేట్ కూడా ఇచ్చారు.
మిథున్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని. అందుకే ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. ఆపరేషన్ జరిగిందని, క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఒకప్పుడు హీరోగా బెంగాలీ, హిందీ ఇండస్ట్రీలను ఓ ఊపుఊపేశారు మిథున్ చక్రవర్తి. శ్రీదేవి సరసన అనేక చిత్రాల్లో నటించారు. ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రంలో మిథున్ నటించి మెప్పించారు. దీంతోపాటు 'హునార్‌బాజ్' షోకి జడ్జిగా వ్యవహరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com