Funky Movie : ఫంకీ పాటపై మిక్స్ డ్ ఒపీనియన్స్ వస్తున్నాయే

Funky Movie :  ఫంకీ పాటపై మిక్స్ డ్ ఒపీనియన్స్ వస్తున్నాయే
X

విశ్వక్ సేన్ హీరోగా నటించిన మూవీ ఫంకీ. అనుదీప్ డైరెక్టర్. నాగవంశీ ప్రొడ్యూసర్. రీసెంట్ గా విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అనుదీప్ స్టైల్లో ఉండే మూవీ అనిపించింది. విశ్వక్ సేన్ పూర్తిగా కథకు ఒదిగిపోయినట్టుగానే కనిపించాడు. కయాడు లోహర్ హీరోయిన్ గా నటించింది. ట్రైలర్ మాత్రం హిలేరియస్ గా ఉంది. సినిమా కూడా అలాగే ఉండబోతోంది అనిపించింది. అయితే మామూలుగా ఇలాంటి మూవీస్ లో వచ్చే పాటలు డిఫరెంట్ గా ఉంటాయి. మాగ్జిమం మాంటేజ్ సాంగ్స్ లానే ఉంటాయి. లేదంటే సింపుల్ గా ఉండేలా ఉంటాయి. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన పాటలు కూడా అలాగే ఉన్నాయి. బట్ ఫస్ట్ టైమ్ థర్డ్ సింగిల్ పై మాత్రం మిక్స్ డ్ ఒపీనియన్స్ వస్తున్నాయి.

మూడో పాట డ్యూయొట్. పాటను బట్టి హీరో, హీరోయిన్ తో మధ్య వచ్చే సంభాషణలా ఉండేలా ఉంది.బట్ అందుకు తగ్గట్టుగా ట్యూన్ సెట్ కాలేదు. దీంతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో పాట పాడిన విధానం కూడా ఆకట్టుకునేలా లేదు. అదీ కాకుండా నిర్మాత నాగవంశీ ఇప్పటి వరకు మూవీస్ స్థాయిలో ఈ పాట లేదు అనిపించింది. ఫంకీ అనే టైటిల్ లాగానే పాటను కూడా ఫంకీగా ఉంచాలనే ప్రయత్నంలా కనిపిస్తుంది. కానీ ఆ పాట అలా లేదు. కాస్త చీప్ గానే ఉంది. సింపుల్ గా చూస్తే ఏదో చాలా చిన్న చిన్న సినిమాల్లో ఉండేలా ఉందీ పాట. డ్యాన్స్ పరంగా కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు. ఏదో పాట సందర్భానికి తగ్గట్టుగా కాక గ్యాప్ ఫిల్లింగ్ లానే ఉంది. పాటను రాసింది దేవ్ పవార్. పాడిన వాళ్లు మాత్రం భీమ్స్, రోహిణి సోర్రాట్. పాడిన విధానంతో పాటు రాసిన విధానం కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. కాకపోతే కొన్నిసార్లు లిరికల్ గా, వీడియోగా యావరేజ్ గా ఉన్న పాటలు సినిమాలో మాత్రం బాగా క్లిక్ అవుతాయి. మరి ఈ పాట కూడా అలాగే క్లిక్ అవుతుందేమో కానీ.. ఓవరాల్ గా చూస్తే మాత్రం పాట యావరేజ్ గా ఉందనిపించుకుంది.

Tags

Next Story