Mohan Babu : ఓల్డ్ సిటీ డాన్ గా మోహన్ బాబు

నట ప్రపూర్ణ మోహన్ బాబు మళ్లీ కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నాడు. విలక్షణ నటుడుగా ఎన్నో అద్భుతమైన పాత్రలతో ఆకట్టుకున్న మోహన్ బాబు ఈ తరంలోని గొప్ప నటుల్లో ఒకరు. కానీ ఆయన స్థాయికి తగ్గ పాత్రలు తెలుగు దర్శకులు క్రియేట్ చేయడం లేదో లేక ఆయనకు చేయడం ఇష్టం లేదో కానీ.. నటనకు గ్యాప్ ఇచ్చారు. ఈ మధ్య వచ్చిన కన్నప్పలో మహదేవ శాస్త్రిగా తనకే సొంతమైన నటనతో మరోసారి మెప్పించిన మోహన్ బాబు.. ఇకపై నాన్ స్టాప్ గా నటించేందుకు నిర్ణయించుకున్నట్టున్నాడు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న 'ద ప్యారడైజ్' ఓ కీలక పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడు.
శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తోన్న ప్యారడైజ్ అనౌన్స్ మెంట్ వీడియోతోనే ఆకట్టుకుంది. ఈ తరహా పాత్రలో ఓ స్టార్ హీరో నటించడం అనేదే ఎవరూ ఊహించలేదు. బట్ ఆ టైప్ రోల్స్ తోనే మాస్ కు చేరువ కావాలని ప్రయత్నిస్తున్నాడు నాని. అందుకే ఒప్పుకున్నాడు. 1980ల కాలంలో సాగే కథగా రూపొందుతోన్న ప్యారడైజ్ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో ఓల్డ్ సిటీకి చెందిన ఓ డాన్ పాత్ర ఉందట. ఆ పాత్ర సినిమాకెంతో కీలకంగా ఉంటుందట. అందుకే ఆ పాత్ర కోసం మోహన్ బాబు అప్రోచ్ అయ్యారు. ఆయనకు నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటి వరకూ మోహన్ బాబు చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఈ క్యారెక్టర్ ఉంటుందట. అంతే కాదు.. ఓల్డ్ సిటీ డాన్ కు తగ్గట్టుగా కంప్లీట్ గా కొత్త మేకోవర్ కూడా ఉంటుందని చెబుతున్నారు. సో.. మొత్తంగా మోహన్ బాబు ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతాడు. తన ఏజ్ కు తగ్గట్టుగా ఆ తరహా పాత్రలు వచ్చినప్పుడైనా నటిస్తే.. ఈ తరానికి ఆయనెంత గొప్ప నటుడో కూడా అర్థం అవుతుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com