Mohan Babu : వెంకటప్పయ్య నాయుడుగా మోహన్ బాబు

Mohan Babu :  వెంకటప్పయ్య నాయుడుగా మోహన్ బాబు
X

నట ప్రపూర్ణ మోహన్ బాబు మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నాడు. నాని ద ప్యారడైజ్ మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తర్వాత అనూహ్యంగా మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ పాత్ర వెంకటప్పయ్య నాయుడుగా.. సినిమా శ్రీనివాస మంగాపురం. అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ఆయన ఓ పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నాడు అని తెలిసేలా ఆయనకు సంబంధించిన లుక్ విడుదల చేశారు. ఆ లుక్ లోనే చాలా పవర్ కనిపిస్తోంది. ఆయన గెటప్ కానీ చూపులోని ఓ పవర్ కానీ అద్భుతం అనిపించేలా ఉంది. నిజంగా రాయలసీమ రామన్న చౌదరి తరహాలో ఆయన లుక్ ఉంది.

ఇక ఈ మూవీలో హీరోగా ఘట్టమనేని జయకృష్ణ పరిచయం అవుతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు తనయుడు అతను. అతనికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా బాగా ఆకట్టుకుంది. మరి అతని సినిమాలో మోహన్ బాబు కీలక పాత్రలో అంటే ఖచ్చితంగా సమ్ థింగ్ స్పెషల్ అనుకోవాలి. ఈ మూవీ టైటిల్ చూస్తే కాస్త క్లాస్ గా ఉన్నా.. ఇప్పటి వరకు వచ్చిన రెండు ఫస్ట్ లుక్ పోస్టర్స్ మాత్రం మాస్ గా ఉన్నాయి. మరి సినిమా ఎలా ఉంటుందో కానీ పోస్టర్స్ బావున్నాయి. హీరోయిన్ గా రషా తడాని నటిస్తోంది. తను ఒకప్పటి స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు ఈవిడ. మొత్తంగా మోహన్ బాబు లుక్ మాత్రం అదిరిపోయింది అనే చెప్పాలి.

Tags

Next Story