Mohan Babu: ఎన్నో రకాలుగా మోసపోయి.. గుణపాఠాలు నేర్చుకున్నాను: మోహన్ బాబు

Mohan Babu (tv5news.in)
Mohan Babu: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే ఇప్పటికీ ఇండస్ట్రీలో చాలా డిమాండ్ ఉంది. ఒకప్పుడు ఆయన సినిమాలకు వచ్చిన కలెక్షన్లు రికార్డ్ స్థాయిలో ఉండేవి కాబట్టి ఆయనకు కలెక్షన్ కింగ్ అనే పేరు వచ్చింది. దాదాపు ఇండస్ట్రీలోని సీనియర్ దర్శకులు అందరితో నటించి.. హిట్ అందుకున్నారు మోహన్ బాబు. అయితే ఇటీవల మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా తిరుపతిలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో మోహన్ బాబు మాట్లాడుతూ స్టేజ్‌పైనే ఎమోషనల్ అయ్యారు.
మోహన్ బాబు ఎంతమంది హీరోలతో సినిమాలు చేసినా.. ఆయనను హీరోగా పరిచయం చేసిన దాసరి నారాయణ రావు అంటే ఆయనకు ఎంతో గౌరవం. అందుకే మోహన్ బాబు పుట్టినరోజు వేడుకల్లో ముందుగా స్టేజ్ ఎక్కగానే ఏం మాట్లాడాలో తెలియడం లేదు గురువుగారు అంటూ దాసరి నారాయణరావును గుర్తుచేసుకున్నారు. అంతే కాకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టే ముందు ఎలాంటి కష్టాలు ఎదుర్కున్నారో గుర్తుచేసుకున్నారు.
తిరుపతి నుండి మద్రాసుకు హీరో అవ్వాలని వెళ్లిన తర్వాత దాదపు 7 సంవత్సరాలు ఆయన తిండిలేకుండా, రెండు జతల బట్టలతో, కారు షెడ్‌లో ఉన్నానన్న విషయాన్ని గుర్తుచేసుకున్నారు మోహన్ బాబు. ఆ తర్వాత మోహన్ బాబుగా దాసరి నారాయణరావు చేతుల మీదుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
కష్ట సమయంలో ప్రతీ క్షణం తన జీవితం ముల్లబాటగా ఉండేదని తెలిపారు మోహన్ బాబు. తాను ఎంతోమందికి ఉపయోగపడ్డారని, కానీ వారెవ్వరూ తనకు ఉపయోగపడలేదని అన్నారు. తాను ఎన్నో రకాలుగా మోసపోయానని, ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నానని చెప్పారు. జీవితం అంటే ఇప్పుడు తెలుస్తోందని మోహన్ బాబు ఎమోషనల్ అయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com