Mohan Babu : నాకు పగ, రాగద్వేషాలు లేవు... ఓటు వేయలేదని పగ పెంచుకోవద్దు..!

Mohan Babu : ఇటీవల జరిగిన 'మా' ఎన్నికల్లో ప్రకాష్రాజ్ పై మంచు విష్ణు వవిజయం సాధించిన సంగతి తెలిసిందే.. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో విష్ణు, అతని ప్యానల్ నుంచి గెలిచిన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఇక్కడ రాజకీయాలు ఉండకూడదని, ఇది రాజకీయ వేదిక కాదు, కళకారుల వేదిక అని అన్నారు. పాలిటిక్స్‌లో ఉన్నవి కంటే ఇక్కడ ఎక్కువ జరుగుతున్నాయని, ఇలాంటివి కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోయానని అన్నారు. ఇక మా ఎన్నికల్లో కొంతమంది బెదిరింపులకు దిగారని అన్నారు. అయినప్పటికీ ఆ బెదిరింపులకు ఎవరూ భయపడలేదని విష్ణుని గెలిపించారని అన్నారు.
తనకి పగ, రాగద్వేషాలు లేవని, తెలివి తేటలతో, అవేశంతో, క్రమశిక్షణతో ఇక్కడి వరుకు వచ్చానని చెప్పుకొచ్చారు. తమకి ఓటు వేయని వారిపైన పగ పెంచుకోవద్దని విష్ణు ప్యానల్ కి సూచించారు. మా' ఖ్యాతిని పెంచాలని, 'మా' సభ్యులకు ఇళ్ల నిర్మాణం.. వాళ్ల సమస్యల పరిష్కారం కోసం త్వరలో తాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిసి మాట్లాడతానన్నారు. 'మా' అధ్యక్షుడు అనేది చిన్న ఉద్యోగం కాదని, ఒక పెద్ద బాధ్యత అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com