Mohan Babu: మంచు మోహన్ బాబు ఇంట తీవ్ర విషాదం..

Mohan Babu (tv5news.in)
Mohan Babu: డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తమ్ముడు మంచు రంగస్వామి నాయుడు గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సోదరుడి మరణంతో మంచు వారి కుటుంబం, బంధువులు బాధలో మునిగిపోయారు.
మంచు రంగస్వామి అంత్యక్రియలు గురువారం తిరుపతిలోని గోవింద ధామం వద్ద నిర్వహించనున్నట్టు సమాచారం. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు దగ్గరుండి నిర్వహించనున్నారు. ఇక తిరుపతిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రంగస్వామి.. మోహన్‌బాబు చేపట్టే పలు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనేవారు. ఆయన లేని లోటు మోహన్ బాబుకు ఎప్పటికీ ఉండిపోతుందని సన్నిహితులు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com