Mohan Babu : నాపై ట్రోల్స్ క్రియేట్ చేయించే ఆ ఇద్దరు హీరోలు ఎవరో నాకు బాగా తెలుసు...!

Mohan Babu : తనపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్‌పై సినీ నటుడు మోహన్ బాబు స్పందించారు. టాలీవుడ్ లోని ఓ ఇద్దరు హీరోలే కొంతమందిని అపాయింట్ చేసుకుని ఈ ట్రోలింగ్స్ చేయిస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారాయన... మోహన్ బాబు నటించిన 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రం రేపు(ఫిబ్రవరి 18)న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్ లో భాగంగా తాజాగా ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఇందులో పలు ఆసక్తికరమైన విషయాల పై మాట్లాడిన మోహన్ బాబు.. సోషల్‌మీడియాలో వచ్చే ట్రోల్స్‌పై కూడా రియాక్ట్ అయ్యారు.. ట్రోల్స్‌కి సంబంధించినవి తెలిసిన వాళ్లు తనకి పంపిస్తుంటారని అయితే అవి నవ్వించే విధంగా ఉండాలి కానీ అసభ్యకరంగా ఉండకూడదని అన్నారు. ఒక్కోసారి వాటిని చూసినప్పుడు బాధగా ఉంటుందని తెలిపారు మోహన్ బాబు.
అయితే ఇలా ట్రోల్స్ క్రియేట్ చేయించే ఇద్దరు హీరోలు తనకి బాగా తెలుసనని అన్నారు. దీనివల్ల తాత్కాలికంగా ఆనందం పొందవచ్చు. కానీ, ఏదో ఒక సమయంలో వాళ్లు కూడా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని పేర్కొన్నారు మోహన్ బాబు. ఇక 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రానికి డైమండ్ రత్నం దర్శకత్వం వహించగా, విష్ణు నిర్మించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com