Mohan Babu : మీమ్స్, ట్రోల్స్‌ను సీరియస్‌గా తీసుకున్న మోహన్‌బాబు.. వారికి లీగల్ నోటీసులు..
Mohan Babu : సన్ ఆఫ్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కలెక్షన్ కింగ్ మోహన్‌బాబుకు.. ఎన్నడూ లేనంతగా సినిమా విడుదలకు ముందే వ్యతిరేకత వచ్చింది.

Mohan Babu : సన్ ఆఫ్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కలెక్షన్ కింగ్ మోహన్‌బాబుకు.. ఎన్నడూ లేనంతగా సినిమా విడుదలకు ముందే వ్యతిరేకత వచ్చింది. సోషల్ మీడియాలో మోహన్‌బాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై పెద్ద ఎత్తున ట్రోల్స్, మీమ్స్ వచ్చాయి. దీన్ని సీరియస్‌గా తీసుకున్న మోహన్‌బాబు.. సదరు మీమ్ పేజీల అడ్మిన్‌లకు లీగల్ నోటీసులు ఇచ్చారు. ట్రోల్స్, మీమ్స్ తనను ఎంతో బాధపెడుతున్నాయని గతంలోనూ మోహన్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఇద్దరు హీరోలు వెనకుండి ఈ పని చేయిస్తున్నారని ఆరోపించారు. ఏదో ఒక సమయంలో వాళ్లు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
Next Story