Mohan Babu : నాని కోసం మోహన్ బాబు భారీ సెట్

నేచురల్ స్టార్ నాని రోజుకు మూడు గంటలు నిద్రపోతున్నాడు. అందుకు కారణం ద ప్యారడైజ్ మూవీ విషయంలో. ఆ మాటకొస్తే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తో పాటు ఆ చిత్ర యూనిట్ మొత్తం ఈ మేరకు పనిచేస్తు ఉంటోంది. అందుకు కారణం ఈ మూవీ రిలీజ్ డేట్. ఆ డేట్ కు ఖచ్చితంగా సినిమా రావాల్సిన కారణంతో సినిమా టీమ్ అంతా వర్క్ చేస్తోంది. ప్రస్తుతం ముచ్చింతల్ ప్రాంతంలో మూవీ షూటింగ్ కు ముగించుకుని మరో షెడ్యూల్ తో రెడీ అవుతున్నాడు. ఆ షెడ్యూల్ లో మోహన్ బాబు జాయిన్ అవడం కూడా జరిగింది.
నాని ఈ మూవీ విషయంలో అస్సలే మాత్రం ఆలస్యం చేయడం లేదు. అదే టైమ్ లో ఆ మూవీ షూటింగ్ పూర్తి చేసి ఆ టైమ్ కు రిలీజ్ చేసే విషయంలో ప్లానింగ్ లో మార్పు కూడా ఉండదు. బట్ ప్లానింగ్ కూడా మార్పు ఉండబోతోంది అనే వార్తలు వస్తున్నాయి చాలాకాలంగా వినిపిస్తోంది. అదే టైమ్ కు రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న పెద్ది మూవీ కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం అందుకు కారణం. నిజానికి నాని మూవీనే ముందగా అనౌన్స్ చేయడం. మరి పెద్ది కూడా వస్తుంది కాబట్టి నాని మూవీ వాయిదా వేస్తుంది అనే కారణం కూడా వినిపిస్తోంది.
ద ప్యారడైజ్ మూవీ రిలీజ్ డేట్ విషయంలో ఎలా ఉంది మాత్రం .. ప్రస్తుతం మూవీ మాత్రం చాలా వేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఈ మూవీ కోసం ఫలక్ నుమా ప్యాలెస్ సెట్ కూడా వేశారు. ఇందుకోసం 7-8 కోట్ల ఖర్చు పెట్టారు అనే టాక్ ఉంది. ఆ సెట్ లో మోహన్ బాబు కోసం చిత్రీకరణ చేస్తున్నారు. మొత్తంగా ఈ మూవీ చిత్రీకరణ మాత్రం చాలా వేగంగా సాగుతోంది. మూవీ గ్లింప్స్ ను కూడా డిసెంబర్ లేదా జనవరిలో విడుదల చేయాలనే ప్రయత్నాల్లో కూడా ఉన్నారు.
రమ్యకృష్ణ తో పాట సోనాలి కులకర్ణి కూడా ఇతర కీలక పాత్రల్లో నటిస్తోన్న మూవీ ఇది. ప్యాన్ ఇండియా రిలీజ్ చేయబోతున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

