MOHAN LAL: సమ్మోహన నట శిఖరానికి "దాదాసాహెబ్ ఫాల్కే"

మలయాళ అగ్ర హీరో మోహన్ లాల్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు లభించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఈ విషయాన్ని శనివారం సాయంత్రం ఎక్స్ వేదికగా ప్రకటించింది. మోహన్ లాల్ సినీ రంగానికి చేసిన సేవలకు 2023 సంవత్సరానికి ఆయన దాదా సాహేబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయినట్టు వివరించింది. సినీ రంగంలో మోహన్ లాల్ నటుడుగా, నిర్మాతగా, డైరెక్టర్ గా ఎన్నో సేవలు అందించారని.. ఆయన సేవలు సినీ రంగ చరత్రిలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గవని ఎక్స్ లో రాసుకొచ్చింది. తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎంపిక కమిటీ సిఫార్సు మేరకు మోహన్‌లాల్‌కు ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2023ని ప్రదానం చేయనున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇండియన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాండ్ కాస్టింగ్ మినిస్టరీ తాజాగా ప్రకటించడం విశేషం. 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా మోహన్ లాల్ కు ఈ అవార్డును ప్రకటించినట్టు I&B మినిస్టరీ వెల్లడించింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోహన్ లాల్ సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు ఎక్స్ ద్వారా పేర్కొంది.
ఆ ప్రస్థానం.. అనితర సాధ్యం
మోహన్‌లాల్ అసలు పేరు మోహన్‌లాల్ విశ్వనాథ్ నాయర్. రెండు సార్లు కుస్తీ పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచిన లాలెట్టన్.. ఆరో తరగతిలోనే నటనలోకి అడుగుపెట్టారు. ‘తిరనోట్టమ్’ సినిమాలో మొదటిసారి నటించారు. అయితే అది విడుదలకు నోచుకోలేదు. ఆ తర్వాత స్నేహితుల బలవంతం మీద ఆడిషన్‌కి వెళ్లి ‘మంజిల్ విరింజ పూక్కల్’లో విలన్ పాత్రకు ఎంపికయ్యారు. అది సూపర్ హిట్టయి సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి బలమైన పునాది వేసింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. 1986లో ఏకంగా 36 సినిమాలు చేశారు. అందుకే తనకు రెస్ట్ తీసుకోవడం నచ్చదని చెబుతారు.
ప్రతిభకు నిలువుటద్దం: మోదీ
భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైన ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనను అభినందిస్తూ, మోహన్‌లాల్ ప్రతిభకు, నటనలో వైవిధ్యానికి నిలువుటద్దం అని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, దశాబ్దాలుగా సాగిన మోహన్‌లాల్ కళా ప్రస్థానం ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు. మలయాళ సినిమా, నాటకరంగంలో ఆయన ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచారని ప్రధాని పేర్కొన్నారు. మలయాళానికే పరిమితం కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా అత్యుత్తమ నటనను ప్రదర్శించారని గుర్తుచేశారు.
రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ అభినందనలు..
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం మోహన్ లాల్ ను అభినందించారు. ” కేరళలోని అందమైన ఆదిపోలి భూమి నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల వరకు, ఆయన చేసిన కృషి మన సంస్కృతిని జరుపుకుంది. అలాగే ఆకాంక్షలను పెంచింది. ఆయన వారసత్వం భారతదేశం సృజనాత్మక స్ఫూర్తిని ప్రేరేపిస్తూనే ఉంటుంది.” అంటూ ట్వీట్ చేశారు.
అద్భుత గౌరవం: పవన్ కల్యాణ్
ఈ నేపథ్యంలో దాసాహెబ్ ఫాల్కే అవార్డుకు మోహన్‌లాల్ ఎంపికవడంపై సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో మోహన్‌లాల్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు పవన్ కల్యాణ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com