Mohanlal : వృషభగా వస్తున్న మోహన్ లాల్

Mohanlal :  వృషభగా వస్తున్న మోహన్ లాల్
X

మోహన్ లాల్ మూవీస్ అంటే భారీగా కనిపించవు. సింపుల్ గానే ఉంటాయి.. బట్ కంటెంట్ పరంగా మాత్రం అదిరిపోయేలా ఉంటుంది. బట్ అప్పుడప్పుడు మాత్రం భారీగా ఉంటాయి. రిచ్ గా కనిపిస్తాయి. విజువల్ పరంగా ఓ రేంజ్ లో ఉంటాయి అనిపిస్తాడు. అలాంటిదే వృషభ మూవీ. ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది మూవీ. ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ విడుదల చేయబోతోంది. అంటే సినిమా స్థాయి మారిపోయినట్టే కదా. గీతా ఆర్ట్స్ బ్యానర్ అంటే మామూలు కాదు కదా. పైగా ఈ బ్యానర్ లో వస్తోన్న మూవీస్ అన్నీ కూడా ఈ మధ్య పెద్ద హిట్స్ గానే నిలిచిపోతున్నాయి. అలా వీళ్లు విడుదల చేయబోవడంతో వృషభ రేంజ్ కూడా మారిపోయింది.

తాజాగా వృషభ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా అదిరిపోయింది. ఫిక్షన్ అలాగే నాన్ ఫిక్షన్ గా కనిపిస్తోంది. రెండు జన్మల కథలా కనిపిస్తోంది. ఈ రెండు జన్మల మధ్య కథేంటీ అనేది ఆకట్టుకునే అంశం. ఈ కాలంలో సాగే కథ, అలాగే రాజుల కాలంనాటి కథగానూ కనిపిస్తోంది. ఈ రెండు గెటప్స్ లో కూడా మోహన్ లాల్ అదరగొట్టాడు అనిపించేలా ఉంది. కంటెంట్ పరంగా చూస్తే నెక్ట్స్ లెవల్ లో కనిపిస్తాడు మోహన్ లాల్. అందుకే ఈ మూవీ కూడా ఆకట్టుకునేలా ఉంది అనిపిస్తోంది.

నంధ కిశోర్ డైరెక్ట్ చేసిన మూవీ ఇది. ఈ చిత్రం కోసం రెండేళ్లు కష్టపడింది టీమ్. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కు కాస్త ఎక్కువ టైమ్ పట్టినట్టుగా ఉన్నట్టే ఉంది. ఏక్తా కపూర్ కూడా నిర్మాతల్లో ఒకరుగా కనిపిస్తోంది. మొత్తంగా ఈ మూవీ క్రిస్మస్ కు భారీగా విడుదల చేయబోతున్నారు. ఆ టైమ్ కు తెలుగులో చాలా సినిమాలు ఉన్నాయి. అయినా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వస్తోంది కాబట్టి రిలీజ్ కు భారీగానే ప్రణాళికలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఫైనల్ గా మోహన్ లాల్ నుంచి మాత్రం మరో ప్యాన్ ఇండియా మూవీ రాబోతోంది.

Tags

Next Story