Mohanlal : గతం ఎప్పుడూ నిశ్శబ్ధంగా ఉండదంటున్న మోహన్ లాల్

Mohanlal  :  గతం ఎప్పుడూ నిశ్శబ్ధంగా ఉండదంటున్న మోహన్ లాల్
X

కొన్ని సినిమాలు వెంటాడుతుంటాయి. మేకింగ్, టేకింగ్, స్క్రీన్ ప్లే, స్టోరీ, యాక్టింగ్.. ఇలా ఏ విభాగం చూసినా ది బెస్ట్ అనిపించేలా ఉంటాయి. అలాంటి మూవీస్ కు కల్ట్ హోదా వస్తుంది. మళయాలంలో రూపొంది దేశంలో చాలా భాషల్లో రీమేక్ అయ్యి.. ఏకంగా చైనాలోనూ రీమేక్ అయ్యి.. అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ అనిపించుకున్న సినిమా ‘దృశ్యం’. మోహన్ లాల్, మీనా జంటగా, అంజలి నాయర్, ఎస్తేర్ అనిల్, ఆశా శరత్ కీలక పాత్రల్లో నటించారు. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ చిత్రానికి సీక్వెల్ కూడా వచ్చింది. ఇలాంటి మూవీస్ ను సీక్వెల్స్ తో ఆకట్టుకోవడం అంత సులభం కాదు. బట్ జీతూ జోసెఫ్ ఫస్ట్ పార్ట్ లోని థ్రిల్ ను ఏ మాత్రం తగ్గించకుండా రెండో పార్ట్ లోనూ అద్భుతం అనిపించుకున్నాడు. సీక్వెల్ రీమేక్ సైతం అన్ని భాషల్లో హిట్ అయింది. లేటెస్ట్ గా ఈ మూవీకి థర్డ్ పార్ట్ కూడా ఉందని ప్రకటించాడు మోహన్ లాల్.

ఇదే విషయాన్ని దర్శక, నిర్మాతలతో పాటు ఉన్న ఓ పోస్టర్ ను జోడించి ప్రకటించాడు. ‘గతం ఎప్పుడూ నిశ్శబ్ధంగా ఉండదు’ అనే క్యాప్షన్ కూడా జోడించాడు. అంటే అతని గతం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుందన్నమాట. సెకండ్ పార్ట్ చివర్లో.. ‘మనం తప్పు చేశాం అన్న భావనకు మించిన శిక్ష వేరే ఏదీ ఉండదు’ అని చెప్పించాడు హీరోతో. మరి ఆ తర్వాత దొరికిన అస్తికలను గంగలోనూ కలిపిన పోలీస్ ఎలాగైనా మోహన్ లాల్ ను అరెస్ట్ చేయించే ప్రయత్నంలో ఈ సారి ఏం చేసింది అనేది ఈ పార్ట్ లో ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు. మరి కాస్టింగ్ ఏదైనా మారుతుందా లేక సేమ్ కాస్టింగ్ తో వస్తారా అనేది చూడాలి. మొత్తంగా ‘దృశ్యం 3’ ఇది వినడానికే చాలా బావుంది కదా..?

Tags

Next Story