Mohan Lal : హ్యాట్సాఫ్ మోహన్ లాల్.. గ్రేట్ డెసిషన్..!

Mohan Lal : హ్యాట్సాఫ్  మోహన్  లాల్.. గ్రేట్ డెసిషన్..!
Mohan Lal : గిరిజన తెగకి చెందిన 20 మంది విద్యార్థులకు 15 ఏళ్ల పాటు ఉచిత విద్యను అందించడానికి ముందుకు వచ్చారు.

Mohan Lal : మలయాళీ స్టార్ హీరో మోహన్ లాల్ మంచి మనసు చాటుకున్నాడు.. గిరిజన తెగకి చెందిన 20 మంది విద్యార్థులకు 15 ఏళ్ల పాటు ఉచిత విద్యను అందించడానికి ముందుకు వచ్చారు. వారి చదువుకు అయ్యే ఖర్చు మొత్తం కూడా తానే భరిస్తానని తెలిపాడు. ఈ విద్యకు అయ్యే ఖర్చును విశ్వశాంతి ఫౌండేషన్‌ కు చెందిన వింటేజ్‌ పతకం ద్వారా మోహన్ లాల్ ఖర్చు చేయనున్నారు. భవిష్యత్తులో మరింత మందిని ఎంపిక చేసి చదివిస్తామని పేర్కొన్నారు మోహన్ లాల్.. ప్రతి సంవత్సరం ప్రతిభావంతులైన పిల్లలను ఎంచుకొని వారి భవిష్యత్తును ఉజ్వలంగా మారుస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. మోహన్ లాల్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రతిఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story