Mohanlal : సైలెంట్ గా వస్తోన్న మోహన్ లాల్ మూవీ

Mohanlal :  సైలెంట్ గా వస్తోన్న మోహన్ లాల్ మూవీ
X

మోహన్ లాల్, శోభన జంటగా నటించిన సినిమా తుడరుమ్. ఈ జోడీకి మళయాలంలో తిరుగులేని క్రేజ్ ఉంది. మోహన్ లాల్, శోభన కలిసి ఏకంగా 50కి పైగా సినిమాలు చేయడం విశేషం. వరల్డ్ సినిమా హిస్టరీలోనే ఇదో రికార్డ్ అని చెప్పాలి. ఒక హీరో, హీరోయిన్ కలిసి అన్ని సినిమాల్లో నటించడం ఫ్యూచర్ లో చూడలేమేమో ఇంక.ఇక ఈ చిత్రాన్ని ఈ 25న విడుదల చేస్తున్నారు. ముందుగా జనవరి 30నే విడుదల చేయాలనుకున్నారు. కానీ లైటర్ వే లో ఉండే తుడరుమ్ వల్ల ఎంపురాన్ కు ఇబ్బంది అవుతుందేమో అని పోస్ట్ పోన్ చేశారు. ఓ రకంగా ఎంపురాన్ మోహన్ లాల్ ఫ్యాన్స్ ను కాస్త డిజప్పాయింట్ చేసింది. బట్ ఈ మూవీ మరోసారి దృశ్యం రేంజ్ లో బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం అందరిలోనూ ఉంది. అందుకు తగ్గట్టుగానే ప్రమోషన్స్ కనిపిస్తున్నాయి. విశేషం ఏంటంటే.. ఈ చిత్రాన్ని అస్సలే మాత్రం సౌండ్ లేకుండా తెలుగులోనూ డబ్ చేస్తున్నారు. అదే రోజు ఇక్కడా విడుదలవుతుందనే బోర్డ్ లు కనిపిస్తున్నాయి. పైగా తెలుగు ట్రైలర్ ను కూడా విడుదల చేశారు.

తెలుగు ట్రైలర్ చూస్తే ఏదో దృశ్యం తరహా సినిమా చూసినట్టుగానే ఉంది. కాకపోతే ఆ టైప్ మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ లేవు. ఇద్దరు టీనేజ్ పిల్లల తండ్రి.. ఇప్పటికీ భార్య అంటే భయపడుతూ.. ఆమెతో సరసాలాడుతూ.. సొసైటీలో తనకంటూ ఓ గుర్తింపుతో బ్రతుకుంటాడు. అతని వద్ద ఓ కార్ ఉంటుంది. ఆ కార్ ఉంటే ఇల్లు కూడా పట్టదు. మరి ఏమైందో ఆ కార్ ను పోలీస్ లు తీసుకువెళ్లిపోతారు. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వరు. ఎలాగోలా కార్ సంపాదించిన అతను.. ఓ సీరియస్ డెసిషన్ తీసుకుంటాడు. అదే ఈ సినిమాలో టర్నింగ్ పాయింట్ లానూ మెయిన్ ప్లాట్ గానూ కనిపిస్తోంది. మరి అందులో ఏదైనా మిస్టరీ ఉంటుందా.. ఉంటే ఏంటీ అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

కాకపోతే మోహన్ లాల్ లాంటి స్టార్ హీరో సినిమాను ఇలా అనామకంగా విడుదల చేయడం మాత్రం ఆశ్చర్యంగా ఉంది. పైగా తెలియకుండానే ఈ 25న చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. మరి ఈ వెల్లువలో మోహన్ లాల్ మూవీని ఎవరైనా పట్టించుకుంటారా అనేది చూడాలి. ఇక ఈ చిత్రాన్ని తరుణ్ మూర్తి డైరెక్ట్ చేశాడు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు.

Tags

Next Story