చేతబడి చేశారు..2సార్లు ఆత్మహత్య చేసుకోబోయా..సీక్రెట్స్ బయటపెట్టిన హీరోయిన్

Mohini

Mohini file Photo 

Mohini: నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన క్లాసిక్ మూవీ 'ఆదిత్య 369'లో నటించిన హీరోయిన్ మోహిని అందరికీ గుర్తుండే ఉంటుంది.

Mohini: నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన క్లాసిక్ మూవీ 'ఆదిత్య 369'లో నటించిన హీరోయిన్ మోహిని అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత 'డిటెక్టివ్‌ నారద', మామ బాగున్నావ వంటి సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నటించింది. అయితే హీరోయిన్ గా సక్సెస్ ఫుల్ జర్నీ కొనసాగిస్తున్న తరుణంలో ఆమె కెరీర్ ఊహించని మలుపు తిరిగింది. నాగార్జున అభిమానిని అని చెప్పిన ఆమె, ఓ సందర్భంలో చిరంజీవి అన్న మాటను గుర్తు చేశారు.

చిరంజీవి నటించిన చిత్రం హిట్లర్ ఆ సినిమా తర్వాత ఆమెకు అవకాశాలు పెద్దగా రాలేదు. ఆ మూవీలో మోహిని చిరంజీవి చెల్లెలుగా నటించడం కూడా ఓ కారణం టాక్. అయితే హిట్లర్ మూవీలో మొదట హీరోయిన్ గా మోహినిని అనుకున్నారంట. చిరంజీవి పక్కన హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చినట్లే వచ్చి మిస్ అయింది. చెల్లెలి పాత్ర ఇచ్చారు. ఆ తర్వాత చిరుతో హీరోయిన్‌గా చేసే అవకాశం లభించలేదు అని మోహిని అన్నారు.

మోహిని చెల్లెలి పాత్రలో చేస్తుందని తెలిసి చిరంజీవి వద్దని చెప్పారంట. నిన్ను చెల్లెలి పాత్ర ఎవరు చేయమన్నారు.. వద్దు అని చిరంజీవి గారు అన్నారు. కానీ సుహాసిని గారు కలగజేసుకొని.. నేను మీకు చెల్లెలిగాను, హీరోయిన్‌ గాను చేశాను కదా అని ఆయన్ను ఒప్పించారు. ఇకపోతే వివాహాం చేసుకున్న తర్వాత జరిగిన పరిణామాలపై మాట్లాడారు మోహిని. పెళ్ళైన 5ఏళ్లకు అనేక మానసిక సమస్యలు ఎదురయ్యాయని చెప్పారు. తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు మోహిని.

పెళ్ళైన 5ఏళ్లకు రెండుసార్లు ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా చేశానని తెలిపారు. కొన్ని సందర్భాల్లో తన పరిస్థితి గందరగోళంగా ఉండేదని చెప్పింది. చివరకు ఓ జ్యోతిష్కుడికి చూపించగా చేతబడి చేశారని ఆయన చెప్పినట్లుగా మోహిని తెలిపారు. అనేక పూజలు, ప్రార్థనలు చేసి యేసు ప్రభును నమ్ముకున్నానని, అప్పటినుంచి మానసిక సమస్యలు దూరమయ్యాయని ఆమె తెలిపారు. మంచి అవకాశం లభిస్తే సినిమాల్లో నటించేందుకు రెడీ అని ఆమె అన్నారు. 13 ఏళ్ల వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసినట్లుగా చెప్పిన మోహిని వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story