Mokshagna : సింబగా వస్తున్న మోక్షజ్ఞ.. అద్దిరిపోయిన ఫస్ట్ లుక్

Mokshagna : సింబగా వస్తున్న మోక్షజ్ఞ.. అద్దిరిపోయిన ఫస్ట్ లుక్
X

తెలుగు తెరకు నందమూరి వంశం కొత్త తరం నటుడు పరిచయం కానున్నాడు. నటసింహం, నందమూరి బాలకృష్ణ నట వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి అంతా సిద్ధమైంది. హనుమాన్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందబోతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను విడుదల చేశారు మేకర్స్‌.

సింబ వస్తున్నాడు అంటూ ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మూవీలో బాలకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. ఆ పాత్రకు బాలకృష్ణ మాత్రమే యాప్ట్‌ అవుతాడని అంటున్నారు యూనిట్‌ సభ్యులు.

బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా వుంటున్నారని సమాచారం. అంతే కాదు ఈ సినిమా నిర్మాణం, షూటింగ్‌ పర్యవేక్షణ అంతా బాలకృష్ణ పర్యవేక్షణలోనే జరగనుందని సమాచారం. మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ ఇంప్రెసివ్ గా ఉంది. ఇండస్ట్రీలో మొత్తానికి నందమూరి తారక రామారావు మరో నట వారసుడు ఎంట్రీ ఇవ్వడం ఆ వంశాభిమానులను ఆనందపరుస్తోంది.



Tags

Next Story