మోక్షజ్ఞ సినిమాకి నేనే రైటర్, నేనే డైరెక్టర్: బాలకృష్ణ

మోక్షజ్ఞ సినిమాకి నేనే రైటర్, నేనే డైరెక్టర్: బాలకృష్ణ
సినిమా ఇండస్ట్రీలో దశాబ్ధాల చరిత్ర ఉన్ననందమూరి వంశంలో మరో వాసుడి ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు.

నందమూరి వంశంలో మరో వాసుడి ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ఎప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ అంటూ మీడియా ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఇప్పుడు, అప్పుడు అంటూ దాట వేస్తూ వచ్చిన బాలకృష్ణ.. తన 61వ పుట్టిన రోజు సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను నటించిన ఆదిత్య 369తోనే మోక్షజ్ఞ చిత్ర రంగంలోకి అడుగుపెడతాడని చెప్పారు. మూడు దశాబ్ధాలకు పైగా తన కెరీర్లో భారీ విజయాలు సొంతం చేసుకున్న బాలకృష్ణకు ఆదిత్య 369 అత్యంత ప్రత్యేకమైనది.

సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రం 1991 ఆగస్ట్ 18న విడుదలై సంచలనం సృష్టించింది. నా తండ్రి ఎన్.టి.రామారావు తన చిత్రాల ద్వారా నన్ను పరిచయం చేసినట్లే, నేను నా కొడుకును ఆదిత్య 369 సీక్వెల్ తో పరిచయం చేయాలనుకుంటున్నాను" అని అన్నారు. పైగా ఈ చిత్రానికే తానే మాటలు రాస్తానని, డైరెక్షన్ చేస్తానని చెప్పారు.

వర్క్ ఫ్రంట్ లో, బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'అఖండ' కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బోయపాటి శ్రీను, బాలకృష్ణల హ్యాట్రిక్ కలయికతో వస్తున్న ఈ చిత్రంపై బాలకృష్ణ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించనుంది. శ్రీకాంత్, సునీల్ శెట్టి, జగపతి బాబు, పూర్ణ, ప్రభాకర్, శరత్ లోహితస్వా, విజి చంద్రశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story