Samyuktha : అమ్మో.. సంయుక్త ఖాతాలో ఎన్ని సినిమాలో

Samyuktha :  అమ్మో.. సంయుక్త ఖాతాలో ఎన్ని సినిమాలో
X

2024లో ఒక్క సినిమా కూడా లేని హీరోయిన్ ఈ యేడాది ఏకంగా అరడజనుకు పైగా ప్రాజెక్ట్స్ లో నటిస్తోందంటే ఆశ్చర్యమే కదా. అఫ్ కోర్స్ వీటిలో కొన్ని 2024 నుంచి చిత్రీకరణ జరుపుకుంటున్నవి కూడా ఉన్నాయి. అలాగే ఇవి ఈ యేడాది ఎన్ని పూర్తవుతాయో కూడా తెలియదు. అయినా ఇప్పటికే తన ఖాతాలో ఆరు సినిమాలున్నాయి. తాజాగా మరో ప్రాజెక్ట్ వచ్చేసింది. మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ అనిపించున్నా.. చేసిన సినిమాలన్నీ హిట్ అయినా ఇప్పటి వరకూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అన్న ట్యాగ్ సంపాదించుకోలేకపోయిన బ్యూటీ సంయుక్త. తన ఖాతాలోనే ఇప్పుడు ఏడు సినిమాలున్నాయి. వీటిలో దాదాపు అన్నీ ప్రామిసింగ్ గానే కనిపిస్తుండటం విశేషం. ఈ ఏడింటిలో నాలుగు తెలుగు సినిమాలే కావడం మరో విశేషం.

నిఖిల్ సిద్ధార్థ్ సరసన హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న స్వయంభు ముందుగా ఒప్పుకున్న సినిమా. ఇందులో తను మెయిన్ హీరోయిన్. నభా నటేష్ మరో హీరోయిన గా నటిస్తోంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వస్తోన్న అఖండ 2 తాండవంలో తనూ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే హీరోయిన్ అని అప్పుడే చెప్పలేం. అలాగే శర్వానంద్ సరసన నారీ నారీ నడుమ మురారితో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో హైందవంలో నటిస్తోంది. ఇవి తెలుగు సినిమాలు.

తన సొంత భాష మళయాలంలో మోహన్ లాల్ తో రామ్ అనే చిత్రం చేస్తోంది. ఇక లేటెస్ట్ గా తమిళ్ మూవీ ఆఫర్ కూడా వచ్చింది. లోకేష్ కనకరాజ్ రాసిన కథతో రాఘవ లారెన్స్ హీరోగా రూపొందుతోన్న ‘బెంజ్’మూవీలో తననే హీరోయిన్ గా తీసుకున్నట్టు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. వీటితో పాటు హిందీలోనూ కాజోల్, ప్రభుదేవా, నషీరుద్దీన్ షా వంటి స్టార్స్ నటిస్తోన్న ‘మహారాజ్ఞి : ద క్వీన్ ఆఫ్ క్వీన్స్’ అనే చిత్రంలో సంయుక్త ఓ కీలక పాత్ర చేస్తోంది. సో.. మొత్తంగా ఏడు సినిమాలున్నాయన్నమాట.

ఇక వీటిలో అఖండ, స్వయంభు, నారీ నారీ నడుమ మురారి ఈ యేడాదే విడుదలవుతాయి. మరి మిగతావి ఎప్పుడొస్తాయో చూడాలి. ఏదేమైనా సంయుక్త లాస్ట్ ఇయర్ దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ నటించిన లవ్ మి చిత్రంలో జస్ట్ గెస్ట్ రోల్ మాత్రమే చేసింది. అలాంటి ఇప్పుడు ఇన్ని మూవీస్ అంటే సూపర్ అనే చెప్పాలి.

Tags

Next Story