Devara Collections : సోమవారం ఎఫెక్ట్ .. దేవర కలెక్షన్లు డౌన్
జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన మూవీ దేవరకు సోమవారం ఎఫెక్ట్ పడింది. ఒక్క సారిగా కలెక్షన్లు డౌన్ అయ్యాయి. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ గత నెల 27న రిలీజ్ అయ్యింది. అంచనాలను నిజం చేస్తూ ఫస్ట్ డే ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ను రాబట్టింది దేవర. తెలుగులో రూ.82.20 కోట్లు, తమిళంలో రూ.1.05 కోట్లు, కర్ణాటకలో రూ.6.40 కోట్లు, కేరళలో రూ. 25 లక్షలు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ.4.55 కోట్లు, ఓవర్సీస్లో రూ.24.70 కోట్లు ఇవన్నీ కలుపుకుని వైల్డ్ వైడ్ గా తొలి రోజే దాదాపు రూ.172 కోట్ల వసూలు రాబట్టింది. రెండో రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో రూ. 16 కోట్లు, మిగిలిన ప్రాంతాల్లో రూ. 10 కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది. మొత్తంగా రూ.110 కోట్ల షేర్తో పాటు ఇప్పటి వరకు రూ.220 కోట్ల గ్రాస్ ను అందుకున్నట్టు తెలు స్తోంది. మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.27.65 కోట్ల వసూళ్లను సాధించగా.. హిందీలో రూ.11 కోట్లు, కర్ణాటకలో రూ.35 లక్షలు, తమిళనాడులో రూ.1.05 కోట్లు, ఓవర్సీస్లో రూ. 7 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. తద్వారా ఎన్టీఆ ర్ మూవీ మూడు రోజుల్లో రూ.266 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రూ.300 కోట్ల దిశగా అడుగులు వేసింది. కానీ నాలుగో రోజు కలె క్షన్లు ఘోరాతి ఘోరంగా పడిపోయాయి. సండే తో పోల్చితే.. నియర్లీ దాదాపు 70 నుంచి 75% టికెట్ సేల్స్ డ్రాప్ అయ్యాయి. ఇండియాలో కేవలం రూ.7.96 కోట్లు మాత్రమే రాబట్టింది. ఒక్కవేళ నైట్ ట్రేడ్ బాగుంటే.. 9 నుంచి 10 కోట్ల దాకా వెళ్లి ఉంటుందనే అంచనా ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com