Euphoria Movie : ఈ వారం అరడజనుకు పైగానే మూవీస్

Euphoria Movie :  ఈ వారం అరడజనుకు పైగానే మూవీస్
X

సంక్రాంతి తర్వాత చాలా పెద్దగా మూవీస్ రాలేదు. వచ్చినవి కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ఈ వారం నుంచి మళ్లీ సినిమాల హడావిడీ మొదలు కాబోతోంది. అది కూడా కొంత వరకు ప్రామిసింగ్ మూవీస్ గానే కనిపించడం మాత్రం పెద్ద ప్లస్ పాయింట్. మొత్తంగా చూస్తే ఫిబ్రవరి 6న అరడజనుకు పైగానే సినిమాలు విడదల కాబోతున్నాయి. ఈ మొత్తం మూవీస్ లో మాగ్జిమం నమ్మకంతో ఉన్న మూవీసే.

సీనియర్ డైరెక్టర్.. ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ గా పేరున్న గుణశేఖర్ చాలా గ్యాప్ తర్వాత రూపొందించిన మూవీ యూఫోరియా. భూమిక, సారా అర్జున్, గౌతమ్ మీనన్, నాజర్ కీలక పాత్రల్లో నటించిన మూవీ ఇది. కాల భైరవ సంగీతం అందించాడు. ఈ మూవీ ప్రస్తుతం యూత్ లో ఉన్న చాలా సమస్యల నేపథ్యంలో సాగే సినిమా అని చెబుతున్నాడు గుణశేఖర్. ఈ మూవీపై మంచి అంచనాలైతే ఉన్నాయి.

నవీన్ చంద్ర హీరోగా నటించిన మూవీ హనీ. హారర్ బ్యాక్ డ్రాప్ లో మంత్రాల కారణంగా రూపొందిన సినిమా ఇది. కరుణ కుమార్ డైరెక్ట్ చేశాడు. రాజా రవీంద్ర మరో కీలక పాత్రలో నటించాడు. ఇదో డిఫరెంట్ మూవీగా కనిపిస్తోంది. ఈ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలే ఉన్నాయి. అయినా ఏదో కొత్తదనం మాత్రం ఈ ట్రైలర్ లో కనిపిస్తోంది. మరి ఈ మూవీ ఎలా ఉండబోతోందో చూడాలి.

అంతా కొత్తవాళ్లే రూపొందించిన సినిమా శ్రీ చిదంబరం. వంశీ తుమ్మల, సంధ్య వశిష్ట కీలక పాత్రల్లో నటించారు. మెల్ల కన్ను ఉన్న ఓ కుర్రాడి నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోంది. మూవీ టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వినయ్ రత్నం డైరెక్ట్ చేసిన ఈ మూవీ కూడా మాగ్జిమం ప్రామిసింగ్ గా కనిపించబోతోంది.

వీటితో పాటు బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి హీరోగా నటించిన మూవీ శుమతి శతకం మూవీ కూడా విడుదల కాబోతోంది. ఎమ్.ఎమ్. నాయుడు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సయాలీ చౌధరి హీరోయిన్ గానటించింది. మరి ఈ మూవీ ఎలా మెప్పిస్తుందో చూడాలి.

వీటితో పాటు ఆపరేషన్ పద్మ, లగ్గం టైమ్, విత్ లవ్, బ్లడ్ రోజెస్, ఎర్రచీర వంటి మూవీస్ కూడా విడుదల కాబోతున్నాయి. మొత్తంగా ఈ వారం విడుదల కాబోతున్న మూవీస్ మాత్రం మాగ్జిమం మెప్పించే అవకాశాలుండేలా ఉన్నాయి.

Tags

Next Story