Most Eligible Bachelor Trailer: ఆ బ్యాచిలర్‌కు నలుగురా..?

Most Eligible Bachelor Trailer: అక్కినేని అబ్బాయిలకు ప్రేమకథలు ఒక లక్కీ టర్న్ లాంటివి. ఇప్పుడే కాదు ఏఎన్‌ఆర్ కాలం నుండి ఆ హీరోల ప్రేమకథలకు ఉన్న క్రేజే వేరు. ఆయన తర్వాత తనయుడు నాగార్జున మాస్ సినిమాలు చేసినా, కమర్షియల్ హిట్‌లు కొట్టినా ఆయనకు ఎక్కువ పేరు తెచ్చిపెట్టింది మాత్రం లవ్‌స్టోరీలే. అవే ఆయనను టాలీవుడ్ మన్మథుడిగా నిలబెట్టాయి. ఇక నాగచైతన్య, అఖిల్‌లు కూడా తమ తండ్రి, తాత వేసిన బాటలోనే నడుస్తున్నారు. ఇప్పటికే చైతు పలు ప్రేమకథలతో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు ఇంక అఖిల్ టర్న్.
ఫీల్ గుడ్ ప్రేమకథలను తెరకెక్కించే దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న చిత్రమే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమా విడుదలవ్వక ముందే మ్యూజికల్ హిట్‌ను అందుకుంది. ఇందులో నుండి విడుదలవుతున్న ప్రతీ పాట ఛార్ట్‌బస్టర్ అవుతోంది. ఇక హీరోయిన్ పూజా హెగ్డే గ్లామర్ సినిమాకు ప్లస్ పాయింట్ అని అర్థమవుతోంది. అందుకే అక్టోబర్ 15న విడుదల కానున్న ఈ మూవీపై అప్పుడే పాజిటివిటీ ఏర్పడింది.
విడుదల ఖరారు కావడంతో మూవీ టీమ్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్‌లో ఆడియన్స్ ఊహించని కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఫరియా అబ్దుల్లా, ఈషా రెబ్బా లాంటి హీరోయిన్లు గెస్ట్ రోల్ చేస్తున్నట్టు ట్రైలర్‌లో రివీల్ అయ్యింది. ఈ అక్కినేని చిన్నోడు బ్యాచిలర్‌గా మారి చేసే మ్యాజిక్‌ను నేరుగా అక్టోబర్ 15న థియేటర్లలో చూడాల్సిందే..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com