Unni Mukundan : టాలీవుడ్ ను ఊరిస్తోన్న మళయాల మూవీ

Unni Mukundan :  టాలీవుడ్ ను ఊరిస్తోన్న మళయాల మూవీ
X

ఈ డిసెంబర్ పుష్ప 2 తప్ప తెలుగు ప్రేక్షకులను మరే సినిమా ఎంటర్టైన్ చేయలేకపోయింది. క్రిస్మస్ కు వచ్చిన సినిమాలు కూడా నిరాశపరిచాయి. అంతకు ముందు వచ్చిన బచ్చలమల్లి మెప్పించలేదు. ఈ ఫ్రైడే మూవీస్ గురించి ఆడియన్స్ కు పెద్దగా తెలియదు. ఈ నేపథ్యంలో జనవరి 1న ఓ హార్డ్ కోర్ యాక్షన్ మూవీ వస్తోంది. అయితే అది తెలుగు సినిమా కాదు. మళయాల మూవీ. సినిమా పేరు 'మార్కో'. అనుష్కతో భాగమతిలో జోడీగా నటించిన ఉన్ని ముకుందన్ హీరో. జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ కొడుకుగానూ నటించాడు. అయినా ఉన్ని ముకుందన్ కు తెలుగులో పెద్దగా గుర్తింపు లేదు. అయినా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చెప్పుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత పాజిటివ్ రివ్యూస్ ఏ మూవీకి వినలేదు. ఈ సినిమా చూడకుండా ఆగలేకపోతున్నా అని రామ్ గోపాల్ వర్మ కూడా ట్వీట్ చేశాడు అంటే ఇంక చెప్పుకోవచ్చు.

నిజానికి ఇదో వయొలెంట్ మూవీ. అత్యంత హింసాత్మక సన్నివేశాలు అనేకం ఉన్నాయి. అవి సెన్సిటివ్ పీపుల్ ను బాగా డిస్ట్రబ్ చేసేలా ఉంటాయి. అయినా మళయాల బాక్సాఫీస్ ను కూడా ఊచకోత కోస్తోందీ సినిమా. 5 రోజుల్లోనే 50కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. మామూలుగా మళయాలీస్ కు ఇలాంటి వయొలెంట్ మూవీస్ పెద్దగా నచ్చవు. వాళ్లు క్లాస్ గా ఉంటూ రూటెడ్ గా ఉండే స్టోరీస్ ను ఎక్కువ ఇష్టపడుతుంటారు. అయినా మార్కో ఇంత పెద్ద విజయం సాధించిందీ అంటే కారణం.. ఎంత వయొలెన్స్ ఉన్నా.. అందుకు తగ్గ ఇంటెన్సిటీ కూడా కథనంలో కనిపిస్తుందనే రివ్యూస్ రావడమే. ఓ సన్నివేశాన్ని కన్విన్సింగ్ గా చెప్పగలిగితే ఎంత హింస ఉన్నా యాక్సెప్ట్ చేస్తాం అని కొన్నాళ్లుగా ప్రూవ్ చేస్తున్నారు ఆడియన్స్. మార్కో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడానికి కారణం అదే. ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ నేపథ్య సంగీతం ప్రాణం పోసింది. అలాగే ఓ నాన్ స్టాప్ సాగే ఓ యాక్షన్ సీక్వెన్స్ గురించి టాప్ టెక్నీషియన్స్ కూడా అదే పనిగా మాట్లాడుకుంటున్నారు.

ఇక ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ డబ్ చేస్తున్నారు. ఓ రకంగా కేవలం రివ్యూస్ వల్లే ఇతర భాషల్లోకి డబ్ అవుతున్న సినిమాగా చెప్పొచ్చు. ఇలా డబ్ అయ్యే కాంతార దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ అయింది. మరి ఆ దమ్ము మార్కోలో కూడా ఉందా లేదా అనేది చూడాలి.

Tags

Next Story