అదిరిపోయే ఫీచర్లుతో మోటరోలా ఎడ్జ్‌ 20..

అదిరిపోయే ఫీచర్లుతో మోటరోలా ఎడ్జ్‌ 20..
Motorola edge 20: స్మార్ట్ ఫోన్ యుగంలో రోజుకో ఫోన్ మార్కెట్లోకి విడుద‌ల అవుతుంది.

Motorola edge 20: స్మార్ట్ ఫోన్ యుగంలో రోజుకో ఫోన్ మార్కెట్లోకి విడుద‌ల అవుతుంది. వినియోగదారులు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్ అవుతూ... కొత్త ఫోన్ల కొనుగోలుపై ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. తాజాగా ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ త‌యారీ కంపెనీ లెనోవో కొత్త ఫోన్ మార్గెట్లోకి దించింది. మోటరోలా పేరుతో మార్కెట్‌లోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.

మోటరోలా ఎడ్జ్‌ 20'. మోటరోలా ఎడ్జ్‌ 20 ఫ్యూజన్ రెండు వేరియంట్లు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ లో ఈ ఫోన్లు అందుబాటులో ఉండ‌నున్నాయి. మోటరోలా ఎడ్జ్‌ 20( 8GB ర్యాం + 128 జీబీ) ధర రూ. 29,999 కాగా, మోటరోలా ఎడ్జ్‌ 20 ఫ్యూజన్‌ (6 జీబీ ర్యాం + 128 జీబీ) ధర రూ. 21,499.

మోటరోలా ఎడ్జ్‌ 20 (ఆగస్టు 24), మోటరోలా ఎడ్జ్‌ 20 ఫ్యూజన్‌ విక్రయాలను (ఆగస్టు 27) ప్రారంభించాలని మోటరోలా భావించింది. అయితే స్మార్ట్‌ఫోన్లను ఒకే రోజున అంటే ఆగస్టు 24 న ఫ్లిప్‌కార్ట్‌లో ప్రి-బుకింగ్స్‌ జరిపేందుకు మోటరోలా నిర్ణయించింది.

ఇక వీటి స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి.

మోటరోలా ఎడ్జ్‌ 20...

5జీ సపోర్ట్‌

6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డీ

ఓఎల్‌ఈడీ మాక్స్ విజన్ డిస్‌ప్లే

ఆక్టా-కోర్ క్వాలకం స్నాప్‌ డ్రాగన్ 778జీ

ఆండ్రాయిడ్ 11 విత్‌ మైయూఎక్స్‌ సపోర్ట్‌

8జీబీ ర్యామ్‌+128 జీబీస్టోరేజ్‌

ట్రిపుల్ రియర్ కెమెరా

108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌,

8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్

16 మెగాపిక్సెల్ సెన్సార్‌

ఫ్రంట్‌ కెమెరా 32 మెగాపిక్సెల్

4000ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ

30 వాట్‌ ఫాస్ట్ చార్జింగ్‌

టైప్‌ సీ చార్జర్‌ సపోర్ట్,

Tags

Read MoreRead Less
Next Story