Mouni Roy : మౌనీరాయ్ మారిపోయింది

Mouni Roy : మౌనీరాయ్ మారిపోయింది
X

బుల్లితెర నుంచి వెండితెరకు ప్రమోట్ అయిన బోల్డ్ బ్యూటీగా మౌనీరాయ్ కి గుర్తింపు ఉంది. మొదట్లో టీవీ స్క్రీన్పై ఎంత పద్ధతిగా కనిపించిందో ఆ తర్వాత సినీనటి అయ్యాక అంతే బోల్డ్ మారిపోయిందీ భామ. తెరను బట్టి అవసరాన్ని బట్టి గ్లామర్ని ఎలివేట్ చేయడం ప్రారంభించింది ఈ బ్యూటీ. ఇటీవల హాటెస్ట్ ఫొ టోషూట్లతో మతులు చెడగొడుతోంది. తాజాగా మరోసారి తనదైన శైలిలో చెలరేగి చీరలో సింగారం ప్రదర్శించిందీ హాట్ బ్యూటీ. స్లీవ్ లెస్ బ్లౌజ్ చీరకట్టుతో మతులు చెడగొట్టింది. తెల్ల చీర రవికె, కాంబినేషన్ గాజులతో మైండ్ బ్లాంక్ అయ్యే ట్రీటిచ్చిందీ ఈ బ్యూటీ. అలా శిరోజాలు విరబూసి కొత్త లోకంలోకి తీసుకెళ్లింది. అయితే ఆ చీరకు దేహశిరులకు అంటిన మరకలేమిటో అర్థం కావడం లేదని వాపోతు న్నారు యూత్. అయితే ఇది ఒక ఆర్ట్ అంటూ పరిచయం చేసింది ఈ అమ్మడు. మౌని రకరకాల భంగిమల్లో ఫోజులివ్వగా, వాటిలో కొన్ని ఫొటోల్లో మౌని తెల్ల చీరలో తళతళా మెరిసిపోతోంది కానీ అక్కడ మట్టి అంటినట్టు కనిపించలేదు. దీనిని బట్టి ఆ గాజు అద్దాల్లోనే ఆర్ట్ అంతా దాగి ఉందని అర్థం చేసుకోవాల్సి వస్తోంది. మాయదారి మౌనీ ఆ వివరం ఏమిటో స్పష్టంగా ఇప్పటికైనా చెబుతుందా లేదా అంటూ యూత్ ప్రశ్నిస్తున్నారు.

Tags

Next Story