అన్నీ తెలిసి అలా మాట్లాడతారేమిటి.. హేమపై నరేష్ సీరియస్

మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుత చర్చ. అధ్యక్షుడిగా కొనసాగుతున్న నరేష్ పదవీ కాలం పూర్తవడంతో మరి కొద్ది రోజుల్లో కొత్తవారిని ఎన్నుకునేందుకు ఇండస్ట్రీ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో అధ్యక్షుడి బరిలో పోటీకి దిగేందుకు పలువురి ప్రముఖుల పేర్లు వినిపించాయి. వారి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న తరుణంలో నటి హేమ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 'మా' నిధులు దుర్వినియోగం చేస్తున్నారని హేమ చేసిన ఆరోపణలను నరేష్ తిప్పికొట్టారు. హేమ వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు.
ఈ మేరకు ఆయన సోమవారం ఉదయం పత్రికా ప్రకటన విడుదల చేశారు. మా గౌరవాన్ని దెబ్బతీసేలా హేమ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. హేమపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కమిటీ నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయాన్ని కూడా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈసారి బరిలో ప్రకాష్ రాజ్, విష్ణు, హేమ, జీవిత, నరసింహారావు దిగుతున్నట్లు ఇప్పటికే పేర్కొన్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com