Mowgli Telugu Movie : పట్టుమని 20 రోజుల్లోనే మోగ్లీ మూవీ

ఒక సినిమా రిజల్ట్ అనేది ఈ రోజుల్లో ఎవరూ కొత్తగా చెప్పక్కర్లేదు. ఏవో కొన్ని సందర్భాల్లో నెగెటివ్ గా చేస్తారు ఆ మూవీ గురించి వినడం చేస్తుంటాం. బట్ ఒరిజినల్ గా మూవీ చూస్తే మాత్రం మాగ్జిమం రిజల్ట్ తేల్చేస్తున్నారు ఆడియన్స్. అలా మోగ్లీ మూవీ విషయంలోనూ ఇదే జరిగింది. ఈ సినిమా విడుదల తర్వాత చాలామంది నెగెటివ్ రివ్యూసే చెప్పారు. సినిమా బాలేదు అన్నారు. చాలామంది జయం మూవీలా ఉందని కూడా చెప్పారు. బట్ ఈ మూవీ టీమ్ మాత్రం సక్సెస్ మీట్స్ పెట్టి మరీ సెలబ్రేట్ చేసింది. బట్ సినిమా పోయింది అనేది కూడా వారికీ స్పష్టంగా తెలిసింది. అందుకే ఈ మూవీ పట్టుమని 20 రోజుల్లోనే ఓటిటికి వస్తోంది. మామూలుగా హిట్ మూవీ కాకపోయినా కనీసం నెల రోజులు అయినా ఆగేది. బట్ డిజాస్టర్ కావడంతో ఈ మూవీని అంత త్వరగా ఓటిటికి విడుదల చేస్తున్నారు.
రోషన్ కనకాల హీరోగా నటించిన మూవీ ఇది. సాక్షి మడోల్కర్ హీరోయిన్. బండి సరోజ్ కుమార్ నెగెటివ్ రోల్ లో కనిపించాడు. కలర్ ఫోటో తర్వాత సందీప్ రాజ్ డైరెక్ట్ చేసిన మూవీ ఇది. కలర్ ఫోటో లాంటి బెస్ట్ మూవీతో వచ్చిన సందీప్ సెకండ్ మూవీతో దారుణంగా ఫ్లాప్ చూశాడు. ఓ రకంగా అతని కెరీర్ కూడా ప్రశ్నార్థకంలో పడిపోయేంతలా ఈ మూవీ రిజల్ట్ కనిపించింది. ఎందుకంటే కలర్ ఫోటో తర్వాత చాలాకాలం పాటు వెయిట్ చేశాడు. అంత వెయిట్ చేసిన తర్వాత కూడా ఇలాంటి రిజల్ట్ తో మూవీ చేయడం అంతే కదా. మొత్తంగా ఈ మూవీతో పీపుల్ మీడియా మరో డిజాస్టర్ అకౌంట్ లో వేసుకుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

