Mr.Bachchan : నెట్‌ఫ్లిక్స్‌లోకి ‘మిస్టర్ బచ్చన్’.. సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్
రవితేజ హీరోగా డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ మూవీ ఈనెల 12న ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలో ఇది రిలీజ్ అవుతుంది. ఆగస్టు15న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇందులో రవితేజకు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చి సినిమా డిజాస్టర్ టాక్ వచ్చినా పాటలు బాగుండటంతో ఓటీటీలో చూద్దాంలే అనుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్ 'మిస్టర్ బచ్చన్' ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఒక పోస్టర్‌ను పంచుకుంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ను ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.33 కోట్లకు దక్కించుకుంది. గతంలో రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలు భారీ వ్యూస్ సాధించాయి. మరి థియేటర్ లో మెప్పించలేక పోయిన బచ్చన్ ఓటీటీ లో రాబోతున్న ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com