Mrunal Thakur: రెండు వారాలు వేశ్యా గృహంలో.. డిప్రెషన్‌లోకి వెళ్లా: మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: రెండు వారాలు వేశ్యా గృహంలో.. డిప్రెషన్‌లోకి వెళ్లా: మృణాల్ ఠాకూర్
Mrunal Thakur: సీతారాం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బ్యూటీ మృణాల్ ఠాకూర్.. సీతామహాలక్ష్మిగా అద్భుతమైన నటనను ప్రదర్శించింది.

Mrunal Thakur: సీతారాం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బ్యూటీ మృణాల్ ఠాకూర్.. సీతామహాలక్ష్మిగా అద్భుతమైన నటనను ప్రదర్శించింది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకుంది. రామంగా నటించిన దుల్కర్ సల్మాన్ తన సినిమా కెరీర్‌లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచింది. బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే మృణాల్ అంత తేలిగ్గా హీరోయిన్ కాలేకపోయింది. 'కుంకుమ భాగ్య' అనే సీరియల్‌లో నటిస్తున్నప్పుడు సినిమా అవకాశాలు వచ్చాయి.


హిందీ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ప్రసారమైన ఈ సీరియల్‌కు మంచి పేరు వచ్చింది. హీరోయిన్‌గా సల్మాన్ ఖాన్ చిత్రంలో మొదటి ఛాన్స్ కొట్టేసింది. కానీ ఆ సినిమాలో ఆమె నటించలేకపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దానికి సంబంధించిన కారణం వివరించింది. సల్మాన్ ఖాన్ నటించిన 'సుల్తాన్' సినిమాలో తనను హీరోయిన్‌గా అనుకున్నారు.


కానీ తరువాత అనుష్క శర్మను తీసుకున్నారు. ఈ సినిమా కోసం ఫైటింగ్‌లో శిక్షణ కూడా తీసుకుందట. తన బరువును కూడా 11 కిలోలు తగ్గించుకుందట. సినిమాలో ఆమెను తీసుకోకపోవడానికి కారణం తన బరువును ఎక్కువగా తగ్గించుకోవడమే అని చెప్పారట. ఆ తర్వాత మరో సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అక్రమ రవాణాకు గురైన తన సోదరిని రక్షించే అక్కగా మృణాల్ కనిపించాలి. అందుకోసం వేశ్య అవతారం ఎత్తాల్సి వచ్చింది.


ఈ సినిమా కోసం కోల్‌కతాలోని ఓ వ్యభిచార గృహంలో మృణాల్ రెండు వారాలు గడిపిందట. అక్కడ వాళ్లతో గడిపి వాళ్ల కథలు వింటున్నప్పుడు చాలా బాధ కలిగేది. ఇంటికి వచ్చిన తరువాత కూడా వాళ్ల కన్నీటి కథలు నన్ను వెంటాడుతుండేవి. ఆ సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని చెప్పింది. ఆ సమయంలో దర్శకుడు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి సాధారణ వ్యక్తిగా తీర్చిదిద్దారు.


ఇక ఆ సినిమా సెట్‌లో దర్శకుడు యాక్షన్‌ చెప్పగానే నటించలేక ఏడ్చేసిందట. 17 ఏళ్ల అమ్మాయిని 60 ఏళ్ల వ్యక్తికి అమ్మే సన్నివేశం. ఆ సమయంలో తాను విన్న వేశ్యల కథలు ఆమె కళ్ల ముందు కదలాడేవట. కానీ ఈ సీన్ చేస్తే ప్రపంచం చూస్తుందని దర్శకుడు అనడంతో ధైర్యం తెచ్చుకుని నటించానని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story