Mrunal Thakur : మరో బంపర్ ఆఫర్ ... రామ్ తో మృణాల్

Mrunal Thakur : మరో బంపర్ ఆఫర్ ... రామ్ తో మృణాల్
X

సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ తెలుగులో మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఉస్తాద్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం దర్శకుడు మహేష్ బాబుతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ దర్శకుడు 'మిస్ పోలిశెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ దర్శకుడు ఇటీవలే రామ్ పోతినేనికి ఓ ఫీల్ గుడ్ స్టోరీని న్యారేట్ చేశాడట. ఆ కథ రామ్ కి విపరీతంగా నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశాడట. అయితే ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్ గా మృణాల్ ను ఫిక్స్ చేశారట మేకర్స్. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మరి మృణాల్ తెలుగులో చేసిన గత రెండు సినిమాలు హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్ ప్లాప్స్ గా నిలిచాయి. మరి రామ్ తో చేసే సినిమా ఆమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Tags

Next Story