Allu Arjun : అల్లు అర్జున్ తో మృణాల్ ఠాకూర్

Allu Arjun :  అల్లు అర్జున్ తో మృణాల్ ఠాకూర్
X

ఐకన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా గురించి అనేక రూమర్స్ వింటూ వస్తున్నాము. కాస్టింగ్, టెక్నీషియన్స్ కు సంబంధించిన న్యూస్ అయితే చాలానే ఉన్నాయి. గతంలో హీరోయిన్ కు సంబంధించిన వచ్చిన వార్తలన్నీ కట్ చేస్తూ దీపికా పదుకోణ్ ను తీసుకున్నారు. తనను ఇంటర్డ్యూస్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తను రెగ్యులర్ హీరోయిన్ లా కాకుండా హాలీవుడ్ రేంజ్ లో భారీ స్టంట్స్ చేస్తే అమ్మాయిలాగానే ప్రెజెంట్ చేయబోతున్నారు అనిపిస్తోంది. అయితే తాజాగా ఈ మూవీలో మరో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ను తీసుకున్నారు అనే న్యూస్ హల్చల్ చేస్తోంది.

మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తెలుగులో డెకాయిట్ మూవీలో నటిస్తోంది. ఇది కాక తనకు తెలుగులో మరో సినిమా లేదిప్పటి వరకూ. ఆల్రెడీ చేసిన సీతారామం, హాయ్ నాన్న, ద ఫ్యామిలీ స్టార్ తో మన ఆడియన్స్ కు ఫేవరెట్ అయింది. తనను ఈ మూవీలో తీసుకుంటున్నారు అనే న్యూస్ ముందు నుంచీ వచ్చింది. అది నిజమే అని తెలుస్తోంది. రీసెంట్ గా మృణాల్ ఠాకూర్ తో ముంబైలో విజువల్ ఎఫెక్ట్స్ కు సంబంధించిన పోర్షన్ ను చిత్రీకరించారు అనే టాక్ వినిపిస్తోంది. ఇది నిజమే అని ఇన్ సోర్స్ కూడా చెబుతున్నాయి. అంటే ఇంతకు ముందు దీపికా పదుకోణ్ ను పరిచయం చేసినప్పుడు కొన్ని విజువల్స్ చూశాం కదా.. అలా మృణాల్ నూ పరిచయం చేయడానికే ఈ షూట్ అంటున్నారు. దీంతో పాటు ఈ పోర్షన్ ను సినిమాలో కూడా ఉపయోగించే అవకాశాలున్నాయి. సో.. ఇంకా అఫీషియల్ గా మూవీ టీమ్ అనౌన్స్ చేయలేదు కానీ.. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ భారీ బడ్జెట్ మూవీలో మృణాల్ ఠాకూర్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతోందన్నమాట.

Tags

Next Story