Mrunal Thakur : మృణాల్ ర్యాంప్ వాక్... ఫోటోలు వైరల్

సీతా రామం' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన మరాఠీ భామ మృణాల్ ఠాకూర్. తన అందంలో అభిమానుల హృద యాలను 'హాయ్ నాన్న' సినిమాతో కొల్లగొట్టింది ఈ సీతా మహాలక్ష్మి. పూజా మేరీ జాన్ అనే బాలీవుడ్ మూవీలోను యాక్ట్ చేసింది. ఈ సినిమాలో తన పాత్ర కోసం ప్రొడ్యూస ర్స్ తో ఫైట్ చేశానని, ఒక్క మాటలో చెప్పాలంటే వారిని అడుక్కున్నానని చెప్పింది. ఆ పాత్ర కోసం మరొక నటిని తీసుకోవాలని చూస్తున్నారని తెలిసి నిర్మాతలతో గొడవ పడ్డట్లు ఈ బ్యూటీ వెల్లడించింది. ఇటీవల 'కల్కి 2898 ఏడీ ' సినిమాలో అతిథి పాత్రలో మెరిసింది. ప్రస్తుతం హై జవానీ తో ఇష్క్ హోనా హై' అనే బాలీవుడ్ మూవీలో నటిస్తోంది. ఫ్యామిలీ స్టార్ సినిమా పెద్దగా ఆడకపోయినా మృణాల్ మాత్రం తన అందం, నటనతో మరోసారి ఆకట్టుకుంది. ఓ ఈవెంట్ లో మృణాల్ ఠాకూర్ చేసిన ర్యాంప్ వాక్ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవు తున్నాయి. ఈ హాట్ ఫొటోలతో అభిమానుల హార్ట్ బీట్ పెంచింది. ప్రభాస్, హను కాంబోలో తెరకె క్కనున్న సినిమాలోనూ మృణాల్ హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com