అల్లు అర్జున్ కి నేను పెద్ద ఫ్యాన్ ని : ధోని భార్య సాక్షి

భారత క్రికెటర్ ఎంఎస్ ధోని, అతని భార్య సాక్షి ధోని తమ సొంత బ్యానర్ అయిన ధోని ఎంటర్‌టైన్‌మెంట్‌తో సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వారి తొలి నిర్మాణంగా, ఎమ్‌ఎస్ ధోని, సాక్షి లెట్స్ గెట్ మ్యారిడ్ ఎల్జీఎం అనే రొమాంటిక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో సాక్షి మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగుయేతర ప్రేక్షకుల కోసం హిందీలో డబ్ చేయబడిన అల్లు అర్జున్ నటించిన అన్ని చిత్రాలను తాను చూశానని వెల్లడించారు.
సాక్షి ప్రెస్ మీట్‌లో అడిగిన ప్రశ్నకు తెలుగు చిత్రాలపై తనకున్న క్రేజ్‌ను వ్యక్తం చేశారు. "నేను అల్లు అర్జున్ సినిమాలన్నీ చూశాను. కానీ అవి నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ లాంటి వాటిల్లో కాదు. అన్నీ కూడా యూట్యూబ్‌లో, గోల్డ్‌మైన్ ప్రొడక్షన్స్‌లలో చూశాను. వారు అన్ని తెలుగు సినిమాలను హిందీలో పెట్టేవారు. అలా నేను అల్లు అర్జున్ సినిమాలన్నీ చూశాను. నేను ఆయనకు చాలా పెద్ద అభిమానిని అని సాక్షి చెప్పడం అందర్నీ ఆకర్షించింది.
ఈ కార్యక్రమంలో, సాక్షి ధోనీ 'LGM' చిత్రం గురించి మాట్లాడుతూ.. “మాకు ఇంకా చాలా ప్రాజెక్ట్‌లు ఆలోచనలో ఉన్నాయి. మేము వాటన్నింటినీ అమలు చేసేందుకు ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు మేము ఎల్‌జిఎమ్‌తో ప్రారంభిస్తున్నాము. ఇది తమిళ చిత్రం. దీన్ని తెలుగులోనూ డబ్బింగ్ చేస్తున్నాం. వాస్తవానికి, ఇక్కడ చాలా మంది మహి అభిమానులు ఉన్నారని నాకు తెలుసు. అందుకే తెలుగులోకి కూడా డబ్ చేయాలని ప్లాన్ చేశాం" అని ఆమె చెప్పుకొచ్చారు.
నార్త్ ఇండియాలో అల్లు అర్జున్‌కి ఎంతటి క్రేజ్ ఉందో సాక్షి చేసిన ప్రకటనతో మరోసారి రుజువైంది. తన నటనకే కాదు, తన స్టైల్, డ్యాన్స్ తోనూ అల్లు అర్జున్ ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ చేతిలో ప్రస్తుతం అద్భుతమైన ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఆయన నాల్లో సారి త్రివిక్రమ్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్‌ని వరుసగా గీతా ఆర్ట్స్, హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లపై అల్లు అరవింద్, ఎస్ రాధా కృష్ణ నిర్మించనున్నారు.
ఈ ప్రాజెక్ట్‌తో పాటు, అల్లు అర్జున్ తన 2021లో వచ్చిన చిత్రం పుష్ప: ది రైజ్‌కి సీక్వెల్ గా రాబోతున్న పుష్ప: ది రూల్ లోనూ కనిపించనున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రంలోనూ నటించబోతున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com